మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కొనుగోలు చేసిన ఇండియన్ క్రికెటర్.. ఎవరో చూసారా!!

సాధారణంగా వాహనాలంటే అందరికి చాలా ఇష్టం. కానీ ఈ ఇష్టం సినిమా రంగంలోని వారికీ, క్రికెటర్లకు మరియు వ్యాపారవేత్తలకు మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే మార్కెట్లో విడుదలైన లగ్జరీ కార్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇదే తరహాలో ఇప్పుడు ఇండియన్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ఒక లగ్జరీ కారుని కొనుగోలు చేసినట్లు తెలిసింది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కొనుగోలు చేసిన ఇండియన్ క్రికెటర్

ఇండియన క్రికెటర్ 'యుజ్వేంద్ర చాహల్' గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పావలసిన అవసరం లేదు. అయితే ఇటీవల ఇతడు ఒక లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. యుజ్వేంద్ర చాహల్ కొనుగోలు చేసిన కారు బెంజ్ కంపెనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ సెడాన్‌.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కొనుగోలు చేసిన ఇండియన్ క్రికెటర్

యుజ్వేంద్ర చాహల్ కొనుగోలు చేసిన ఈ కారుని తన భార్యకు కంపెనీ యాజమాన్యం డెలివరీ చేసింది. మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ డెలివరీకి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. ఇందులో యుజ్వేంద్ర చాహల్ కేవెన్‌ సైట్ బ్లూ కలర్ షేడ్‌ను కారుని కొనుగోలు చేసినట్లు చూడవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కొనుగోలు చేసిన ఇండియన్ క్రికెటర్

చాహల్ కొనుగోలు చేసిన ఈ సి-క్లాస్ సెడాన్ ఏ వేరియంట్ మరియు దాని ఖరీదు ఎంత అనేది ఖచ్చితంగా తెలియదు. మెర్సిడెస్ సి-క్లాస్ సెడాన్ ధర రూ. 50 లక్షల ఎక్స్‌షోరూమ్‌తో ప్రారంభమవుతుంది. దీని గరిష్ట ధర 1 కోటి రూపాయలకంటే ఎక్కువగా ఉంటుంది. ఈ కారును కంపెనీ వివిధ వేరియంట్లలో మార్కెట్లోకి విడుదల చేసింది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కొనుగోలు చేసిన ఇండియన్ క్రికెటర్

మీరు ఈ లగ్జరీ కారును రెగ్యులర్ సెడాన్, క్యాబ్రియోలెట్, కూపే మరియు 63 AMG వెర్షన్లలో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ కారును సి 200 మరియు సి 220 డి అనే రెండు వేరియంట్లలో విక్రయిస్తోంది. సి 200 వేరియంట్లో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. కావున ఇంజిన్ 203 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కొనుగోలు చేసిన ఇండియన్ క్రికెటర్

ఇక సి 200 డి వేరియంట్లో 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 194 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. రెండు ఇంజిన్ల యొక్క గరిష్ట వేగం గంటకు దాదాపు 240 కిలోమీటర్లు. ఇందులోని డీజిల్ ఇంజిన్ కేవలం 6.9 సెకన్లలో 100 కిమీ/గం చేరుకోగా, పెట్రోల్ ఇంజన్ ఈ వేగాన్ని చేరుకోవడానికి కేవలం 7.7 సెకన్లు మాత్రం పడుతుంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కొనుగోలు చేసిన ఇండియన్ క్రికెటర్

మరోవైపు, 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మెర్సిడెస్ సి-క్లాస్ క్యాబ్రియోలెట్‌లో కూడా ఉపయోగించబడుతుంది, అయితే ఇది ప్రోగ్రెసివ్ వేరియంట్ కంటే శక్తివంతమైనది. ఈ ఇంజన్ గరిష్టంగా 258 బిహెచ్‌పి పవర్ మరియు 370 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఈ కారు కేవలం 6.2 సెకన్లలో 100 కిమీ/గం వేగాన్ని సాధించగలదు. దీని గరిష్ట వేగం గంటకు 250 కి.మీ.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కొనుగోలు చేసిన ఇండియన్ క్రికెటర్

చివరగా 3.0-లీటర్ వి6 పెట్రోల్ ఇంజిన్ సి43 కూపేలో ఉపయోగించబడుతుంది. ఇది గరిష్టంగా 390 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 4.7 సెకన్లలో 100 కి.మీ వేగవంతం అవుతుంది. మరోవైపు, లైనప్‌లో ఉన్న టాప్ వేరియంట్ C63 AMG వేరియంట్‌లో 4.0-లీటర్ V8 పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 476 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. ఈ కారు 4 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని సాధిస్తుంది. ఈ వేరియంట్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు.

Image Courtesy: Auto Hangar Mercedes-Benz

Most Read Articles

English summary
Indian Cricketer Yuzvendra Chahal Buys A Mercedes-Benz C-Class. Read in Telugu.
Story first published: Friday, July 30, 2021, 11:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X