ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారుతో టీమిండియా స్టార్ క్రికెటర్ మాజీ భార్య.. వైరల్ అవుతున్న వీడియో

ఇటీవల కాలంలో ఇండియాలో విడాకుల కేసులు భారీగా పెరుగుతున్నాయి. దంపతుల మధ్య మనస్పర్ధలు వస్తే చాలు వెంటనే కోర్టును ఆశ్రయించి పరస్పర అంగీకారంతో విడిపోతున్నారు. ముఖ్యంగా చాలా మంది సినీ తారలు, క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు తమ దాంపత్య జీవితాన్ని విడాకులతో ముగిస్తున్నారు. ఇలా విడిపోయిన వారు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటుండగా, కొంతమంది ఒంటరిగా ఉంటున్నారు. తమకు నచ్చిన సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటుండటంతో అభిమానులు సైతం పెద్ద షాక్‌కు గురవుతున్నారు. ప్రధానంగా దేశంలో సినిమా తారలకు, క్రికెటర్లకు అభిమానులు దేశవ్యాప్తంగా ఉంటారు. విడాకుల వార్త వచ్చిందంటే చాలా తమకు నచ్చిన తారలు లేదా క్రికెటర్లు ఎవరైనా విడాకులు తీసుకుంటున్నారా అని సోషల్ మీడియాలో వెతుకుతుంటారు. తాజాగా టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ తన భార్యతో విడాకులు తీసుకున్నారు. ఇది అభిమానుల్లో కలకలం రేపుతోంది.

టీమిండియా‌లో ప్రముఖ స్పిన్నర్లలో ఒకరుగా ఉన్న చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. దీంతో తాజాగా వారిద్దరు కోర్టు మెట్లెక్కారు. ముంబై బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టుకు చాహల్‌, ధనశ్రీ ఇద్దరు హాజరుకాగా, వారిద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్నట్లు పేర్కొనడంతో న్యాయమూర్తి వారికి విడాకులు మంజూరు చేశారు. ఇటీవల ధనశ్రీ ఖరీదైన లగ్జరీ కారుతో కనిపించింది.

Dhanashree Verma Spotted With Mercedes Benz

అత్యంత కఠినమైన పరిస్ధితుల్లో ఉన్న ఆమె తన విడాకుల బాధను ముఖంలో కనిపించకుండా చిరునవ్వుతో ముంబై విమానాశ్రయంలో పలువురిని పలకరించారు. కెమెరాలకు నవ్వుతూ ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే విమానాశ్రయానికి వచ్చిన కారు ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ ముంబై విమానాశ్రయంలోకి మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ సి 200 (Mercedes-Benz C-Class c200)కారుతో ఎంట్రీ ఇచ్చారు. ఈమె ఫోటోలు దిగుతున్న క్రమంలో ఈ బెంజ్ కారు పలువురిని ఆకట్టుకుందని చెప్పవచ్చు. దీని ధర భారతీయ మార్కెట్లో దాదాపు రూ.60 లక్షల వరకు ఉంది. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. పన్నులు, ఇతరత్రా వాటితో కలిపి రూ.75 లక్షల వరకు ఉంటుంది.

Dhanashree Verma Mercedes Benz

ఇంత ఖరీదైన కారు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో రన్ అవుతుంది. ఇది 5800 - 6800 rpm వద్ద 201 bhp పవర్, 1,800 - 4,000 rpm వద్ద 300 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌ను ఇంజిన్‌కు జత చేశారు. కస్టమర్లకు ఇది 6 కలర్ వేరియంట్లలో కొనుగోలుకు లభిస్తుంది. ఇది కేవలం 7.3 సెకన్లలో 0-100 KMPH వేగాన్ని అందుకుంటుంది.

ధనశ్రీ వర్మతో పాటు ఆమె మాజీ భర్త యుజ్వేంద్ర చాహల్‌కు సాధారణంగా లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆమె వద్ద ఇతర కంపెనీలకు చెందిన ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. అలాగే యుజ్వేంద్ర చాహల్‌ వద్ద కూడా పోర్స్చే కయెన్ ఎస్, లంబోర్గిని సెంటెనారియో వంటి కోట్లు విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నాయి.

Mercedes Benz C Class C200

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య ఏమిటంటే: భారతదేశంలో SUVలతో పోలిస్తే సెడాన్‌ల అమ్మకాలు తగ్గముఖం పడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 10 సెడాన్ మోడల్స్ బడ్జెట్ ధరలో కొనుగోలుకు ఉన్నాయి. సెడాన్ కార్ల అమ్మకాలు నెల నెలా తగ్గుతున్నప్పటికి మారుతి సుజుకి డిజైర్ అమ్మకాలు మాత్రం సానుకూలంగానే ఉన్నాయి. ఇతర కంపెనీలు తమ సెడాన్ విక్రయాలను పెంచడంపై దృష్టి సారించాయి. రానున్న రోజుల్లో వీటి సేల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, February 24, 2025, 17:00 [IST]
English summary
Yuzvendra chahal ex wife dhanashree verma spotted with mercedes benz car video goes viral
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+