జీరో ఎలక్ట్రిక్ స్కూటర్ వెస్పా సెగ్‌వే - వివరాలు

By Ravi

సెగ్‌వే (Segway) అనే సెల్ఫ్ బ్యాలెన్సింగ్ పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్ వాహనాలు మన దేశంలో అంత పాపులర్ కాలేదు కానీ, అంతర్జాతీయ మార్కెట్లలో వీటి పట్ల ఓ ప్రత్యేక క్రేజ్ ఉంది. అధునాతన టెక్నాలజీ, డిజైన్‌లతో పాటుగా ఎకో ఫ్రెండ్లీ, జీరో ఎమిషన్, ఎనెర్జీ ఎఫీషియంట్ క్వాలిటీస్ కారణంగా ఇవి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాయి.

స్పెయిన్‌కు చెందిన ఓ వ్యక్తి వెస్పా స్టయిల్‌లో ఉండే ఓ సెగ్‌వేను తయారు చేసి, అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. పురాతన క్లాసిక్ వెస్పా డిజైన్ ఫీచర్లను గ్రహించి, ముందు వైపు నుంచి చూస్తే, పాత వెస్పా స్కూటర్‌లా అనిపించేలా దీనిని డిజైన్ చేశారు. ఈ క్లాసిక్ వెస్పా సెగ్‌వేకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి!

జీరో ఎలక్ట్రిక్ స్కూటర్ వెస్పా సెగ్‌వే

ఈ జీరో ఎలక్ట్రిక్ స్కూటర్ వెస్పా సెగ్‌వేను పియాజ్జియో నుంచి గ్రహించిన ఒరిజినల్ విడిభాగాలతో తయారు చేశారు. అందుకే ఇది లుక్ పరంగాను మరియు పెర్ఫార్మెన్స్ పరంగాను క్లాసిక్ ఇటాలియన్ వెస్పా ఫీల్‌ను ఆఫర్ చేస్తుంది.

జీరో ఎలక్ట్రిక్ స్కూటర్ వెస్పా సెగ్‌వే

ఇందులో రెండు 1.34సివి ఇంజన్లను అమర్చారు (రెండు చక్రాలలో). ఇది గరిష్టంగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసినట్లయితే, దీనిపై 34 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు.

జీరో ఎలక్ట్రిక్ స్కూటర్ వెస్పా సెగ్‌వే

ఇది ఇతర సెగ్‌వేల మాదిరిగా కాకుండా, 180 కిలోల బరువున్న వ్యక్తిని కూడా సులువుగా క్యారీ చేయగలదు. అంతేకాకుండా, 30 డిగ్రీల కోణంలో ఉండే ఎత్తులను కూడా ఇది సులువుగా ఎక్కేయగలదు.

జీరో ఎలక్ట్రిక్ స్కూటర్ వెస్పా సెగ్‌వే

మాక్సీహాబీ నుంచి అందుబాటులో ఉన్న ఈ జీరో ఎలక్ట్రిక్ స్కూటర్ వెస్పా ధర 2995 యూరోలు (మన కరెన్సీలో సుమారు రూ.2.5 లక్షలు).

జీరో ఎలక్ట్రిక్ స్కూటర్ వెస్పా సెగ్‌వే

సెగ్‌వే పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్లు లిథియం అయాన్ బ్యాటరీల ద్వారా పనిచేస్తాయి. సెగ్‌వే సెల్ఫ్-బ్యాలెన్స్‌డ్ పర్సనల్ ట్రాన్స్‌‌పోర్టర్లను నడపటం చాలా సులువు. పర్సనల్ ట్రాన్స్‌‌పోర్టర్లను ముందుకు లేదా వెనకు మూవ్ చేయాలంటే దానిపై ఉండే రైడర్ కొద్దిగా ముందుకు లేదా వెనకకు వంగి కదలిక చేస్తే సరిపోతుంది.

జీరో ఎలక్ట్రిక్ స్కూటర్ వెస్పా సెగ్‌వే

అలాగే కుడివైపుకు లేదా ఎడమవైపుకు తిరగాలంటే, స్టీరింగ్ ఫ్రేమ్‌ను కుడివైపుకు కానీ లేదా ఎడమవైపుకు కానీ స్వల్పంగా వంచితే సరిపోతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇది మోషన్ సెన్సార్ల ఆధారంగా, రైడర్ కదలికలను బట్టి ముందుకు, వెనకు, కుడి వైపుకు ఎడమ వైపుకు తిరుగుతుందన్నమాట.

జీరో ఎలక్ట్రిక్ స్కూటర్ వెస్పా సెగ్‌వే

సెగ్‌వే పర్సనల్ ట్రాన్స్‌పోర్టర్లు కేవలం సాధారణం ప్రయాణం కోసం మాత్రమే కాకుండా, విమానాశ్రయాలు, పెద్ద పెద్ద పరిశ్రమలు, టూరిజం, పోలీస్ పెట్రోలింగ్ వంటి ప్రయోజాల కోసం వీటిని ఉపయోగిస్తుంటారు.

More from DriveSpark

Article Published On: Monday, March 10, 2014, 12:26 [IST]
English summary
The brainchild of Spanish design outfit Bel & Bel, it's a hand built vehicle that mimics the Segway's form factor while liberally borrowing from the iconic Vespa's design aesthetics. It's one strange yet cool hybrid.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+