Mahindra Treo డ్రైవ్ చేసి ఆనంద్ మహీంద్రాకు సూచనలు అందించిన Zoho సీఈఓ.. ఏం చెప్పారంటే?

భారతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త మరియు అధునాతన ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలవుతున్నాయి. భారతదేశంలో పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు బైకులు, కార్లు మరియు ఎలక్ట్రిక్ ఆటోలను కూడా విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని చాలా నగరాలలో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు ఎక్కువగానే కనిపిస్తాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు ఎలా పనిచేస్తాయి, సాధారణ ప్రజలను ఏ మాత్రం అనుకూలంగా ఉంటాయి, అనేది చాలా వరకు తెలియదు.

అయితే ఇటీవల జోహో కార్పొరేషన్‌ సీఈవో 'శ్రీధర్‌ వెంబు' మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా డ్రైవ్ చేశారు. అంతే కాకుండా అతడు మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు సలహాలు కూడా అందించారు. మనం ఈ ఆర్టికల్ లో దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Mahindra Treo డ్రైవ్ చేసి ఆనంద్ మహీంద్రాకు సూచనలు అందించిన Zoho సీఈఓ.. ఏం చెప్పారంటే?

ప్రముఖ వ్యాపారవేత్త మరియు జోహో CEO శ్రీధర్ వెంబు మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటోరిక్షాను ఒక ప్రాక్టికల్ కమ్యూటింగ్ వాహనంగా అభివర్ణించారు. ఇతడు మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోను పల్లె ప్రాంతాల్లో స్వయంగా నడిపి చాలా ఆనందం పొందాడు. ఇందులో భాగంగానే శ్రీధర్ వెంబు సోషల్ మీడియాలో మహీంద్రా గ్రూప్ చీఫ్ ఆనంద్ మహీంద్రాకు సూచనలు కూడా చేశారు.

Mahindra Treo డ్రైవ్ చేసి ఆనంద్ మహీంద్రాకు సూచనలు అందించిన Zoho సీఈఓ.. ఏం చెప్పారంటే?

మహీంద్రా యొక్క ఈ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఫీచర్లను హైలైట్ చేస్తూ, ఈ ఎలక్ట్రిక్ ఆటోరిక్షా 55 కిమీ/గం వేగంతో నడుస్తుంది. అంతే కాకూండా ఒక్క ఫుల్ ఛార్జింగ్‌తో 125 కిమీల పరిధిని కూడా అందిస్తుంది. ఇది నిజంగా సామాన్య ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుంది, అన్నారు.

Mahindra Treo డ్రైవ్ చేసి ఆనంద్ మహీంద్రాకు సూచనలు అందించిన Zoho సీఈఓ.. ఏం చెప్పారంటే?

మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా, రూ. 3.5 లక్షల కంటే తక్కువ ధరతో కూడిన కుటుంబ వాహనం అని వెంబు తెలిపారు. ఇది సరసమైన ధర వద్ద లభించే మంచి ఎలక్ట్రిక్ వాహనం అని కూడా అయన అభివర్ణించారు. దీని డిజైన్ చూపరులను ఒక్కసారిగానే ఆకర్షిస్తుంది అన్నారు.

Mahindra Treo డ్రైవ్ చేసి ఆనంద్ మహీంద్రాకు సూచనలు అందించిన Zoho సీఈఓ.. ఏం చెప్పారంటే?

శ్రీధర్ వెంబు ఈ ఎలక్ట్రిక్ ఈ రిక్షా నడుపుతున్న సమయంలో చాలామంది ఇది ఎక్కడ దొరుకుతుంది అని కూడా అడిగినట్లు తెలిపారు. కావున కుటుంబానికి మరియు పిల్లలకి అనుకూలమైన ఎంపికలతో ఈ ఆధునిక ఎలక్ట్రిక్ త్రీవీలర్‌ను వివిధ డిజైన్‌లు మరియు రంగులలో అందించాలని ఆనంద్ మహీంద్రాను కోరారు.

Mahindra Treo డ్రైవ్ చేసి ఆనంద్ మహీంద్రాకు సూచనలు అందించిన Zoho సీఈఓ.. ఏం చెప్పారంటే?

ఈ ఎలక్ట్రిక్ ఈ-రిక్షా ను మరిన్ని కలర్స్ లో మరియు వివిధ రకాల డిజైన్‌లతో పరిచయం చేయమని కూడా ఆనంద్ మహీంద్రాకు తెలిపారు. పిల్లలు, కుటుంబాలకు తగ్గట్లు చిన్న మార్పులు ఇంచులో చేయండి. మంచి మార్కెటింగ్‌తో ఈ లోకాస్ట్‌ ఈవీను ప్రచారం చేస్తే, కచ్చితంగా వర్కవుట్‌ అవుతుంది. ఇదే మీ కిచ్చే సలహా' అంటూ ట్వీట్ల ద్వారా సలహాలు ఇచ్చారు.

Mahindra Treo డ్రైవ్ చేసి ఆనంద్ మహీంద్రాకు సూచనలు అందించిన Zoho సీఈఓ.. ఏం చెప్పారంటే?

ఈ ఎలక్ట్రిక్ ఈ-రిక్షా ను మరిన్ని కలర్స్ లో మరియు వివిధ రకాల డిజైన్‌లతో పరిచయం చేయమని కూడా ఆనంద్ మహీంద్రాకు తెలిపారు. పిల్లలు, కుటుంబాలకు తగ్గట్లు చిన్న మార్పులు ఇంచులో చేయండి. మంచి మార్కెటింగ్‌తో ఈ లోకాస్ట్‌ ఈవీను ప్రచారం చేస్తే, కచ్చితంగా వర్కవుట్‌ అవుతుంది. ఇదే మీకిచ్చే సలహా' అంటూ ట్వీట్ల ద్వారా సలహాలు ఇచ్చారు.

Mahindra Treo డ్రైవ్ చేసి ఆనంద్ మహీంద్రాకు సూచనలు అందించిన Zoho సీఈఓ.. ఏం చెప్పారంటే?

మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా పూర్తిగా స్వదేశీ ఉత్పత్తి, అంతే కాకుండా దీని ధర కూడా ఇతర వాహనాలతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది, కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది పల్లె ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటో ఇప్పటికి మంచి అమ్మకాలను పొందుతోంది.

Mahindra Treo డ్రైవ్ చేసి ఆనంద్ మహీంద్రాకు సూచనలు అందించిన Zoho సీఈఓ.. ఏం చెప్పారంటే?

ఇక జోహో కార్పొరేషన్‌ సీఈవో 'శ్రీధర్‌ వెంబు' విషయానికి వస్తే, అమెరికాలోని ప్రపంచ ప్రసిద్ద సిలికాన్ వ్యాలీలో ఓ పెద్ద కంపెనీకి యజమాని అయిన ఇతడు, వాటన్నింటినీ వదిలేసి తాను పుట్టి పెరిగిన స్వదేశం వచ్చేశారు. తమిళనాడులోని మారుమూల గ్రామం మాథాలంపరైలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. రూ.18వేల కోట్ల సామ్రాజ్యం వదిలేసి పేద పిల్లల కోసం వచ్చేశాడు. నిజంగా శ్రీధర్‌ వెంబు మాటలకందని మహా మనిషి.

Mahindra Treo డ్రైవ్ చేసి ఆనంద్ మహీంద్రాకు సూచనలు అందించిన Zoho సీఈఓ.. ఏం చెప్పారంటే?

ఇదిలా ఉండగా మహీంద్రా & మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్‌లో ఇప్పుడు పూర్తిగా నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది కంపెనీ తన ఎలక్ట్రిక్ కార్ మహీంద్రా eXUV300 ని ఆవిష్కరించే అవకాశం ఉంది. మహీంద్రా యొక్క వాహనాలను కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో కూడా మంచి ఆదరణ ఉంది. ఈ కారణంగానే కంపెనీ యొక్క వాహనాలు ఊహకందని రీతిలో అమ్మకాలను పొందుతుంది.

Most Read Articles

English summary
Zoho ceo sridhar vembu drives mahindra treo electric rickshaw details
Story first published: Tuesday, December 7, 2021, 16:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X