'నో పెట్రోల్‌' ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌లో గుర్రంపై ఫుడ్ డెలివరీ, వైరల్‌ వీడియో

తెలంగాణలో నిన్న పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నా చేపట్టి(Oil Tankers Owner Protest) విరమించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా పలు చోట్ల పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిచ్చాయి. ఇక హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్‌ బంకుల వద్ద రద్దీతో తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ క్రమంలో చంచల్‌గూడలో గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసిన సంఘటన చోటుచేసుకుంది.

కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన నూతన చట్టం.. భారతీయ న్యాయ సంహిత చట్టం (Bharatiya nyay sanhita). అయితే ఈ చట్టంలోని హిట్ అండ్ రన్‌ కేసులపై తీసుకొచ్చిన కఠిన నిబంధన ట్రక్కు డ్రైవర్ల ధర్నాకు కారణమైంది. మంగళవారం దేశవ్యాప్తంగా ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు ఉదయం నుంచి ధర్నాకు దిగారు. దీంతో పెట్రోల్‌ బంకుల వద్ద 'ఎంట్రీ క్లోజ్‌' అంటూ 'నో స్టాక్‌' బోర్డులు పెట్టారు.

Zomato-Boy-Food-Delivers-On-Horse

భారతీయ న్యాయ సంహిత చట్టంలోని హిట్ అండ్ రన్ కేసు(Hit and Run Cases)ల్లో డ్రైవర్లకు భారీఎత్తున జరిమానాలు, జైలు శిక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు మంగళవారం(జనవరి 2) సమ్మెకు దిగారు. దీనిపై యుద్ధప్రాతిపదికన స్పందించిన కేంద్రం.. యూనియన్లను చర్చలకు ఆహ్వానించింది. చర్చల అనంతరం డ్రైవర్లు తాత్కాలికంగా సమ్మెను విరమించుకున్నారు.

అయితే ఈ కొద్ది గంటల ధర్నా సమయంలోనే వాహనదారులు పెట్రోల్‌ బంక్‌ల వద్ద క్యూ కట్టారు. ఇక హైదరాబాద్‌లో రద్దీ కారణంగా తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఆయిల్‌ ట్యాంకర్ల యజమానుల సమ్మె విరమణతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు చంచల్‌గూడలో జరిగిన ఓ సంఘటన వైరల్‌ అవుతోంది. పెట్రోల్‌ బంక్‌ల వద్ద నో స్టాక్‌ బోర్డుల కారణంగా గుర్రంపై ఫుడ్‌ డెలివరీ చేశాడు ఓ యువకుడు.

Zomato-Boy-Food-Delivers-On-Horse

హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ కంపెనీలు స్విగ్గీ, జొమాటోల(Zomato Food Delivery Boy On Horse)కు డిమాండ్‌ ఎక్కువ. ఉద్యోగులు, బ్యాచ్‌లర్స్‌ ఎక్కువగా వీటిపైనే ఆధారపడుతుంటారు. లేట్‌ కాకుండా ఇన్‌ టైమ్‌లో డెలివరీ చేస్తుండటంతో చాలా మంది క్షణాల్లో ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టి డెలివరీ తీసుకుంటున్నారు. ఇందులో ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ పాత్ర కీలకం.

కస్టమర్లకు ఆర్డర్‌ డెలివరీ చేయడానికి ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌(Food Delivery On Horse) ఎక్కువగా టూ వీలర్లనే ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ ఆయిల్‌ ట్యాంకర్ల సమ్మె పిలుపుతో పెట్రోల్‌ బంక్‌ల వద్ద రద్దీ కారణంగా వేరే దారిలేక ఈ యువకుడు గుర్రంపై ఫుడ్‌ డెలివరీ చేసేందుకు రోడ్డెక్కాడు. పెట్రోల్‌ కొరతతోనే ఇలా చేసినట్లు జొమాటో బాయ్‌ చెప్పుకొచ్చాడు.

Zomato-Boy-Food-Delivers-On-Horse

మంగళవారం పెట్రోల్‌ కోసం బంకు వద్ద నిలబడిన జొమాటో డెలివరీ బాయ్‌.. ఫ్యూయెల్‌ దొరక్కపోవడంతో చివరికి తన బైక్‌ను పక్కనపెట్టి గుర్రంపై ఫుడ్‌ డెలివరీ చేశాడు. ఈ సంఘటనను కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో తెగ వైరల్‌ అవుతోంది. కస్టమర్లకు ఇన్‌టైమ్‌లో ఫుడ్‌ డెలివరీ చేసేందుకు ఈ యువకుడు ఇలా చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

రోడ్డుపై ట్రాఫిక్‌ మధ్యలో ఓ యువకుడు భుజంపై జొమాటో డెలివరీ బ్యాగ్‌ వేసుకుని గుర్రంపై స్వారీ చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ దృశ్యాన్ని రోడ్డుపై అందరూ వింతగా చూస్తున్నారు. మరికొందరు తమ సెల్‌ఫోన్లలో ఈ సంఘటనను రికార్డ్‌ చేశారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగించిన పెట్రోల్‌ ట్యాంకర్ల సమ్మె నేపథ్యంలో ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 3, 2024, 14:20 [IST]
English summary
Zomato boy riding a horse and delivering food order in hyderabad viral video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+