జొమాటో సీఈవో వాడే కారు ధర తెలిస్తే పక్కా షాక్ అవుతారు..!
జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ కార్ల ప్రేమికుడిగా చాలా సుపరిచితుడు. అతని గ్యారేజీలో ఇప్పటికే చాలా ఫేమస్ కార్లు ఉన్నాయి. తాజాగా అతని లిస్ట్ లో ఫెరారీ రోమా సూపర్ కారు చేరింది. జోమాటో ప్రధాన కార్యాలయం హర్యానాలోని గురుగ్రామ్ రోడ్లపై దీనిపై అతను కనిపించాడు. దీని ధర ప్రస్తుత మార్కెట్ లో ఆన్-రోడ్ ధర రూ.4.3 కోట్లుగా ఉంది.

2021లో, ఫెరారీ రోమా మోడల్ కార్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికి మార్కెట్ లో పరిమిత సంఖ్యలో మాత్రమే కార్లు సేల్ అయ్యాయి. రెడ్ కలర్ లో అద్భుతమైన డిజైన్ రోమా ఫెరారీ తీసుకువచ్చింది. ఇతర ఫెరారీల మాదిరిగా కాకుండా అద్భుతమైన డిజైన్ ను ఈ కారు కలిగి ఉంది. రోమా ఇంటిగ్రేటెడ్ DRLలు, నాలుగు టెయిల్ ల్యాంప్ లతో స్లిమ్ ఆల్-LED హెడ్ ల్యాంప్ లను ఈ కారుకు అమర్చారు. ఇది క్వాడ్-ఎగ్జాస్ట్ సెటప్, ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ స్పాయిలర్ తో వస్తుంది.

760NM గరిష్ట టార్క్..
పాత ఫెరారీలతో పోలిస్తే కొత్త ఫెరారీ రోమా క్యాబిన్ పూర్తి భిన్నంగా ఉంటుంది. కారు డ్రైవర్ కో-డ్రైవర్ కోసం రెండు వేర్వేరు సెల్ ల సదుపాయాన్ని కల్పించింది. సెంటర్ కన్సోల్ లో 8.4-అంగుళాల టాబ్లెట్-శైలి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఈ కారు 16-అంగుళాల ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, కెపాసిటివ్ బటన్ లతో కూడిన కొత్త స్టీరింగ్ వీల్ తో వస్తుంది.
3.9-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్ తో ఈ రోమా కారు శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 690 PS వద్ద 760 Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వెనుక చక్రాలకు ఇంజిన్ శక్తిని పంపుతుంది.

గ్యారేజ్ లో లంబోర్గిని ఉరస్, పోర్షే కార్స్..
దీపిందర్ గోయల్ కు ఇదివరకే లంబోర్గిని ఉరస్, పోర్షే 911 కారెరా S కార్లు ఉన్నాయి. లంబోర్గిని ఉరస్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రజాదరణ పొందిన మొట్టమొదటి ఆధునిక SUVగా గుర్తింపు పొందింది. దేశంలోనే అత్యంత వేగంగా దాదాపు 200 కంటే ఎక్కువ యూనిట్లు సేల్ చేసిన కారు ఈ ప్రత్యేక SUV లంబోర్ఘిని గుర్తింపు పొందింది.
భారతదేశంలోని చాలా మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉరుస్ ను కొనుగోలు చేశారు. బాలీవుడ్ నటులు రణవీర్ సింగ్, కార్తీక్ ఆర్యన్, అంబానీ కుటుంబం వంటి ప్రముఖుల వద్ద ఈ కారు ఉంది. వీరితో పాటు ఇతర సంపన్నుల వద్ద కూడా ఈ కారును తమ గ్యారేజీలో చేర్చుకున్నారు.

పోర్షే 911 కారెరా S ఐకానిక్
మరోవైపు, పోర్షే 911 కారెరా S ఐకానిక్ కార్ మోడల్ గా గుర్తింపు పొందింది. చాలా సంవత్సరాలుగా పారిశ్రామిక వేత్తలు ఇతర ఔత్సాహికులు ఈ కారును ఎంచుకుంటున్నారు. 911ని సొంతం చేసుకోవడం అనేది ఔత్సాహిక వర్గాల్లో ఓ అలవాటుగా తయారైంది. ఈ కార్లకు ఉన్న ప్రత్యేక ఆకర్షణ నేటికి అలానే కొనసాగుతోంది.
911 కారు స్పెసిఫికేషన్లలో స్పోర్ట్స్ కార్ ట్విన్ టర్బోచార్జర్ లతో కూడిన 3.0-లీటర్ ఫ్లాట్-సిక్స్ సిలిండర్ బాక్సర్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. 450 Bhp వద్ద 530 Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 911 కారెర్రా S 4 సెకన్ల కంటే తక్కువ వ్యవధిలో 100 Kph వేగాన్ని అందుకుంటుంది. గేర్ షిఫ్టింగ్ అనేది 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా నిర్వహించబడుతుంది. ఇది ప్రపంచంలోని ఏ కారులోనైనా అత్యంత వేగవంతమైన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లలో ఒకటిగా ఉంది. రియర్-వీల్ డ్రైవ్ లేఅవుట్ ప్రామాణికంగా ఇది వస్తుంది.


Click it and Unblock the Notifications








