జొమాటో సీఈఓ కొత్త కారు.. భారత్‌లో ఇదే ఫస్ట్ డెలివెరీ!.. ధర తెలిస్తే షాకవుతారు
సాధారణంగా ఖరీదైన సూపర్ కార్లను సాధారణ ప్రజలకంటే సెలబ్రిటీలు లేదా ప్రముఖులు ఎక్కువగా కొనుగోలు చేస్తారని అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో భాగంగానే జొమాటో సీఈఓ 'దీపిందర్ గోయల్' సరికొత్త ఆస్టన్ మార్టిన్ కొనుగోలు చేశారు. మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం..
బ్రిటీష్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'ఆస్టన్ మార్టిన్' (Aston Martin) గత ఏడాది సెప్టెంబర్‌లో తన కొత్త జీటీ కారు డీబీ12 లాంచ్ చేసింది. లాంచ్ అయిన దాదాపు ఐదు నెలల తరువాత మొదటి కారును జొమాటో సీఈఓకు డెలివరీ చేసింది. దీంతో ఆస్టన్ మార్టిన్ డీబీ12 కారును సొంతం చేసుకున్న మొదటి వ్యక్తిగా గోయర్ రికార్డ్ క్రియేట్ చేశారు.

దీపిందర్ గోయల్ సొంతం చేసుకున్న ఈ కారు ధర రూ.4.59 కోట్లు(ఎక్స్ షోరూమ్). కాగా ఇప్పటికే ఈయన గ్యారేజిలో పోర్స్చే 911 టర్బో ఎస్, ఫెరారీ రోమా మరియు లంబోర్ఘిని ఉరుస్ వంటి మరిన్ని ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే ఆస్టన్ మార్టిన్ డీబీ12 యొక్క ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో దేశంలో మొదటి ఆస్టన్ మార్టిన్ డీబీ12 డెలివరీ అని ఉండటం చూడవచ్చు.
రేసింగ్ గ్రీన్ కలర్ పొందిన ఈ ఆస్టన్ మార్టిన్ డీబీ12 చూడగానే ఆకర్షించే విధంగా ఉంది. ఇది 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటడం చూడవచ్చు. దీపిందర్ గోయల్ కొనుగోలు చేసిన ఈ కారులో ఏమైనా కస్టమైజేషన్ మార్పులు, జరిగాయా.. లేదా అనేది ఖచ్చితంగా వెల్లడికాలేదు. దీని ఫీచర్స్ మరియు స్పెసిషిఫికేషన్స్ గురించి కొనుగోలుదారు ప్రస్తావించాల్సి ఉంది.

నిజానికి కొత్త ఆస్టన్ మార్టిన్ డీబీ12 కారు పెద్ద ఫ్రంట్ గ్రిల్ పొందుతుంది. డీఆర్ఎల్ రీ డిజైన్ చేయబడి ఉండటం చూడవచ్చు. చాలా వరకు డీబీ12 డిజైన్ మరియు సిల్హౌట్ ఆస్టన్ మార్టిన్ డీబీ11 మాదిరిగా ఉంటుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు డ్యూయెల్ టోన్ లెదర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి.
ఆస్టన్ మార్టిన్ డీబీ12 కారు 4.0 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 680 పీఎస్ పవర్ మరియు 800 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కంపెనీ ఈ ఢిల్లీలోని సెలెక్ట్ కార్స్ డీలర్షిప్ నుంచి విక్రయిస్తుంది.
గ్లోబల్ మార్కెట్లో మాత్రమే కాకుండా ఆస్టన్ మార్టినా కార్లకు భరతదేశంలో కూడా మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ కారు ధర ఎక్కువ కావడం వల్ల దీనిని చాలా వరకు సెలబ్రిటీలు, క్రికెటర్లు లేదా ఇతర ప్రముఖులు మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ధర ఎక్కువైనా మంచి డిజైన్ మరియు ఫీచర్స్ ఉండటం వల్ల ఈ కారు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








