ఏం కారండి బాబు.. జొమాటో సీఈఓ కొత్త కారు చూశారా!.. ధర ఎంతో తెలుసా

ప్రముఖ బిలినీయర్ మరియు జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ ఖరీదైన అన్యదేశ్య కార్లను ఉపయోగిస్తారని అందరికి తెలుసు. ఇప్పటికే ఈయన గ్యారేజిలో కోట్ల విలువైన కార్లు ఉన్నాయి. తాజాగా ఈయన మరో సూపర్ కారులో కనిపించారు. ఇది బెంట్లీ కంపెనీ యొక్క కాంటినెంటల్ జీటీ స్పీడ్‌ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈయన బెంట్లీ కాంటినెంటల్ జీటీ స్పీడ్‌ కారు ధర ఎంత? ఇప్పటికే ఈయన గ్యారేజిలోని ఇతర కార్లు ఏవి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ యొక్క ఈ కొత్త బెంట్లీ కాంటినెంటల్ జీటీ స్పీడ్‌ ధర రూ. 6.5 కోట్లు అని తెలుస్తోంది. ఇది పసుపు రంగుల్లో చాలా అద్భుతంగా ఉండటం చూడవచ్చు. ఈ కారు పబ్లిక్ రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కారు ఢిల్లీ ఢిల్లీలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.

Zomato CEO Deepinder Goyal Bentley

దీపిందర్ గోయల్ బెంట్లీ కాంటినెంటల్ జీటీ స్పీడ్ 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది. ఈ కారు యొక్క ఫెండర్‌లపై స్పీడ్ బ్యాడ్జ్ కూడా చూడవచ్చు. ఇది 6.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ డబ్ల్యు12 ఇంజిన్ పొందుతుంది. ఇది 650 Bhp పవర్ మరియు 9 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

మంచి డిజైన్ కలిగిన ఈ కారు.. అత్యాధునిక ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది. ఈ కారు కేవలం 3.5 సెకన్లలో గంటకు 0-100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 315 కిమీ/గం కావడం విశేషం. ఇది వాహన వినియోగదారులకు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. నిజానికి బెంట్లీ కార్లను ధనవంతులు మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం వీటి ధర అధికంగా ఉండటమే.

Zomato CEO Deepinder Goyal Bentley

దీపీందర్ గోయల్ ఇతర కార్లు

దీపీందర్ గోయల్ వద్ద ఆస్టన్ మార్టిన్ డీబీ12 కూడా ఉంది. దీని ధర రూ. 4.59 కోట్లు. ఇది ప్రత్యేకమైన శాటిన్ ఆస్టన్ మార్టిన్ రేసింగ్ గ్రీన్‌ పెయింట్ స్కీమ్ పొందుతుంది. ఈ కారు 4.0-లీటర్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 680 పీఎస్ పవర్, 800 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సూపర్‌కార్‌ను డెలివరీ చేసుకున్న మొట్ట మొదటి ఇండియన్ కస్టమర్ దీపిందర్ గోయల్ అని తెలుస్తోంది.

గోయల్ గ్యారేజిలోని ఫెరారీ రోమా, పోర్స్చే 911 టర్బో ఎస్ కూడా ఉన్నాయి. ఫెరారీ కారు 3.9 లీటర్ ఇంజిన్ కలిగి 620 Bhp పవర్ మరియు 769 Nm టార్క్ అందిస్తుంది. పోర్స్చే కారు 3.8 లీటర్ ఇంజిన్ కలిగి 640 Bhp పవర్ మరియు 800 Nm టార్క్ అందిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.3.76 కోట్లు, రూ. 3.3 కోట్లు.

పైన చెప్పుకున్న కార్లు మాత్రమే కాకుండా పోర్స్చే 911 కారెరా, లంబోర్ఘిని ఉరుస్ మరియు బీఎండబ్ల్యూ ఎమ్8 కాంపిటీషన్ వంటి కార్లు కూడా దీపీందర్ గోయల్ గ్యారేజిలో ఉన్నాయి. వీటి ధరలు కోట్ల రూపాయలలో ఉంటాయి. ఇవన్నీ కూడా డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంటాయి. వీటి ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల.. సాధారణ ప్రజలు వీటిని కొనుగోలు చేయడం కొంత కష్టమనే చెప్పలి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, August 3, 2024, 12:30 [IST]
English summary
Zomato ceo deepinder goyal rs 6 5 crore new bentley car
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+