భార్యతో కలిసి ఫుడ్‌ డెలివరీకి వచ్చిన జొమాటో యజమాని.. కట్‌ చేస్తే.. షాకింగ్‌ వీడియో!

ప్రస్తుతం ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ జొమాటో, స్విగ్గీ ద్వారా లక్షల సంఖ్యలో యువత ఉపాధి పొందుతున్నారు. ఆన్‌లైన్ ఫుడ్‌ సర్వీస్‌కి డిమాండ్‌ కూడా అంతే మొత్తంలో ఉంది. మీకు నచ్చిన హోటల్ నుంచి నచ్చిన ఆహారాన్ని ఇంట్లో కూర్చొని ఆర్డర్‌ పెట్టుకోవచ్చు. ఈ ట్రెండ్‌ భారతీయుల ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చేసింది. నచ్చిన ఫుడ్‌ కోసం ఇంట్లోనే కూర్చుని ఇంటికి రప్పించుకోవచ్చు. ఈ విషయం కాసేపు పక్కన పెడితే జొమాటో కంపెనీ సీఈఓ దీపిందర్‌ గోయెల్‌ (Zomato CEO Deepinder Goyal) తెలియని వారు ఉండరు. ఇతను డెలివరీ బాయ్స్‌ కష్టాలను తెలుసుకునేందుకు అప్పుడప్పుడు డెలివరీ బాయ్‌ అవతారం ఎత్తడం ద్వారా ఫేమస్ అయ్యాడు. తాజాగా మరోసారి ఆయన వార్తల్లో నిలిచాడు.

ఓ అతిపెద్ద సంస్థకు యజమానిగా ఉండి కిందిస్థాయి కార్మికుడిలా పని చేయడం ద్వారా వారి కష్టాలను తెలుసుకునేందుక దీపిందర్‌ గోయల్‌కి ఇలా చేస్తూ ఉంటాడు. ఈ సారి సరికొత్తగా జొమాటో డెలివరీ ఏజెంట్‌గా భార్యతో కలిసి దీపిందర్ గోయల్ డెలివరీ బాయ్స్ అవతారం ఎత్తాడు. ఆ తర్వాత వారితో చాలా సేపు గడిపాడు. అతను అదే కంపెనీకి సీఈఓ అని వారికి తెలియకపోవడం విశేషం.

Zomato ECO Deepinder Goyal Spotted on triumph Scrambler

ఇక పూర్తి వార్తలోకి వెళ్తే ఫుడ్‌ డెలివరీ కోసం గుర్‌గ్రామ్‌లోని ఓ మాల్‌కి వెళ్లిన దీపిందర్‌కి వింత అనుభవం ఎదురైంది. మాల్‌లో ఆర్డర్‌ పికప్‌ చేసుకునేందుకు మారువేషంలో వచ్చిన జొమాటో సీఈఓను సెక్యూరిటీ సిబ్బంది మాల్‌లోకి అనుమతించలేదు. అతడిని లిఫ్ట్, ఎస్కలేటర్ వాడొద్దని కేవలం మెట్ల మార్గం గుండా వెళ్లాలని సెక్యూరిటీ గార్డ్‌ సూచిస్తుంది. దీంతో ఆమె సూచన మేరకు మెట్లపై నుంచి డెలివరీకి వెళ్తాడు.

దీనికి సంబంధించిన విజువల్స్‌ని దీపిందర్ గోయల్ వివిధ సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు, తన అనుభవాలను పంచుకున్నాడు. దీంతో ఆ వీడియోలు వైరల్‌ అయ్యాయి. మాల్ నుంచి ఆర్డర్ తీసుకునే సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోను కూడా దీపిందర్ షేర్ చేశాడు. గురుగ్రామ్‌లోని ఆంబియెన్స్ మాల్‌లోని హల్దీరామ్ నుంచి పికప్ వచ్చింది. గోయల్ తన భార్య గ్రేసియా మునోజ్‌తో కలిసి తన ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X తో మాల్‌కి వెళ్తాడు.

Zomato ECO Deepinder Goyal Spotted on triumph Scrambler

అయితే ఓ సెక్యూరిటీ గార్డు ప్రవేశ మార్గం వద్ద ఆపి వెనుక ద్వారం గుండా పైకి వెళ్లమని సూచిస్తుంది. ఉద్యోగులు, డెలివరీ భాగస్వాముల కోసం మాల్‌లో ప్రత్యేక లిఫ్ట్ ఉందా అని మరోసారి పరిశీలించినా అలాంటిది అక్కడ కనిపించలేదు. ఈ వీడియోలో గోయల్ ఇతర డెలివరీ ఉద్యోగుల మాదిరిగానే మూడో అంతస్తుకు మెట్లు ఎక్కుతూ వెళ్లాడు.

ఆ తర్వాత పరిస్థితిని చూసిన దీపిందర్‌ ఒక్కసారిగా కంగుతిన్నాడు. డెలివరీ బాయ్స్‌ని మాల్ ఎంట్రన్స్‌ నుంచి రానివ్వడమే కాకుండా ఆర్డర్లను అందుకోవడానికి మెట్లపైనే వేచి ఉంచేలా చేశారు. అందరీ లాగానే దీపిందర్ గోయల్ కూడా నేలపై కూర్చొని ఫుడ్ ఆర్డర్ తీసుకోవడానికి డెలివరీ బాయ్స్‌తో మాట్లాడుతున్న ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారాయి. ఈ పోస్ట్‌కి పాజిటివ్, నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

డెలివరీ సిబ్బంది హుందాగా పనిచేయడానికి అవసరమైన సహాయాన్ని వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. డెలివరీ భాగస్వాముల పని పరిస్థితులను మెరుగుపరచడానికి మేము (జొమాటో) మాల్స్‌లో మరింత దగ్గరగా పనిచేయాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా పలు రెసిడెన్షియల్ సొసైటీల్లో ఫుడ్ డెలివరీ ఏజెంట్లను లిఫ్టుల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, October 9, 2024, 18:35 [IST]
English summary
Zomato ceo deepinder goyal spotted on triumph scrambler mistreated by mall security video gone viral
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+