సంకల్పం మంచిదే.. ఇలా చేయడం ప్రమాదం బాస్! - మీరేమంటారు?
ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన పరీక్షల్లో ఒకటి 'యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్'(UPSC). ఈ పరీక్షకు చదవాలంటే.. అహర్నిశలు కష్టపడాల్సి వస్తుంది. దీనికి నిలువెత్తు నిదర్శనమే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటనలో ఒక జొమాటో డెలివరీ బాయ్ రద్దీగా ఉండే.. ప్రదేశంలో కూడా UPSCకి సంబంధించిన వీడియో చూస్తుండం చూడవచ్చు. ఈ వీడియో ఆయుష్ సంఘీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది. చాలామంది జొమాటో బాయ్ సంకల్పానికి ఫిదా అయిపోతున్నారు. లెక్కకు మించిన యూజర్లు పెద్ద సంఖ్యలో లైక్స్ చేస్తున్నారు.

మార్చి 29న పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికి 71000 వేల కంటే ఎక్కువ వ్యూవ్స్ వచ్చాయి. వేలసంఖ్యలో లైక్స్ వచ్చాయి. ఎలాగైనా యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో సన్నద్ధమవుతున్న జొమాటో డెలివరీ బాయ్ కష్టాన్ని నెటిజన్లు కూడా తెగ అభినందిస్తున్నారు. నిజంగా ఇది ఎంతో మందికి ఆదర్శం కూడా. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు అరుదుగా కనిపిస్తాయి.
ప్రతి ఏటా దేశంలో ఎంతోమంది సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతారు. అయితే ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరూ సక్సెస్ సాధించలేరు. అయితే నిరాశ చెందకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే.. తప్పకుండా సక్సెస్ నీ సొంతమవుతుంది. డబ్బు ఉన్న వారు మాత్రమే సివిల్స్ చదవాలనే రూల్ ఎక్కడా లేదు, సంకల్పం బలంగా ఉండి.. సాధించాలనే తపన ఉన్న ఎవరైనా సివిల్స్ సాధించవచ్చు.

గొప్ప విజయాలు సాధించాలంటే కేవలం సంపన్న కుటుంబంలోనే పుట్టాల్సిన అవసరం. పేదరికంలో పుట్టి కూడా అద్భుతమైన విజయాలు సాధించిన వారు చరిత్రలోనే కాదు.. ఆధునిక కాలంలోనూ ఉన్నారు. విజయం సాధించాలంటే.. ప్రధానంగా కావలసింది సంకల్ప సిద్ది. నిరంతర శ్రమ. ఇవే ఒక వ్యక్తిని గొప్పవాణ్ణి చేస్తాయి. కాబట్టి వీడియోలో కనిపించే జొమాటో బాయ్ కూడా తప్పకుండా అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాము.
జొమాటో డెలివరీ బాయ్ సంకల్పం ప్రశంసనీయమే.. కానీ ట్రాఫిక్ సమయంలో రోడ్డుపై కాకుండా మొబైల్ మీద ద్రుష్టి పెడితే.. ఊహకందని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆ ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి తప్పకుండా రోడ్డుపైన బైక్ రైడ్ చేస్తున్న సమయంలో ద్రుష్టి రోడ్డు మీద ఉండాలి. లేకుంటే ఇతర వాహనదారులు ఢీ కొట్టే అవకాశం ఉంది.
భారతదేశంలో ప్రతి ఏటా కొన్ని లక్షల మంది రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి కారణాలు ఎన్నెన్నో ఉంటాయి. కొన్ని సార్లు మనం జాగ్రత్తగా రోడ్డు మీద వెళ్తున్న ఎవరో వచ్చి ఢీ కొట్టవచ్చు. ఇలాంటి సంఘటనలు కూడా కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. కాబట్టి వాహన వినియోగదారులు రోడ్డు మీద చాలా జాగరూకగా ఉండాలి. లేకుంటే ప్రమాదాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది.
దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే రోడ్లు మరమ్మత్తులు చేయడం, ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేయడం వంటిఇవ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్యను తప్పకుండా తగ్గిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే పలు సందర్భాల్లో పేర్కొన్నారు. దీనికి వాహన వినియోగదారుల సహకారం కూడా ఎంతో అవసరం.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








