రూ. 17 లక్షల హయబుసా బైక్‌పై జొమాటో డెలివరీ బాయ్.. షాక్‌లో నెటిజన్లు, కారణమదే.!!
స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాక సోషల్ మీడియా ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగమైపోయింది. వైరల్ అవ్వడం కోసం క్రేజీ ఫొటోలు, వీడియోలతో సోషల్ వెబ్‌సైట్లలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో పబ్లిక్ ప్లేస్‌ల్లో రీల్స్ చేస్తూ హడావుడి చేస్తున్నారు. తాజాగా రూ. 17 లక్షల ఖరీదైన బైక్‌పై జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్‌గా ఓ యువకుడు హంగామా చేశాడు.
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. కొందరు ఇతరులకు ఆటంకం కలిగించకుండా రీల్స్ చేసుకుంటూ తమ పనిలో తాము ఉంటే.. మరి కొందరు మాత్రం హద్దులు దాటుతూ పబ్లిక్ రోడ్లపైకి వచ్చేస్తున్నారు. జనాల దృష్టిని ఆకర్షిచేందుకు వింత చర్యలకు పాల్పడుతున్నారు.

ఇటీవల ఓ యువకుడు.. జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ అవతారమెత్తి ఖరీదైన సుజుకి హయాబుసా(Suzuki Hayabusa) సూపర్‌బైక్‌ను నడిపాడు. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. సంబంధిత వీడియోను హర్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఢిల్లీ రోడ్లపై యువకుడు సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌ను నడపడాన్ని వీడియోలో చూడవచ్చు.
దేశంలో ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల్లో జొమాటో ఒకటి. వీడియోను పరిశీలించినట్లయితే.. యువకుడు జొమాటో డెలివరీ బాయ్ టీ-షర్ట్ ధరించాడు. అతని వెనుక డెలివరీ బ్యాగ్ కూడా ధరించాడు. అయితే ఆ వ్యక్తి జొమాటోకు చెందిన నిజమైన డెలివరీ బాయ్‌లా కనిపించడం లేదని తెలుస్తోంది.

యువకుడు సూపర్ బైక్ యొక్క ORVMలో 360 డిగ్రీ కెమెరాను కూడా ఇన్‌స్టాల్ చేసినట్లు తెలుస్తోంది. అతను బైక్ నడుపుతున్న దృశ్యాలను రికారార్డు చేయడానికి ఈ క్యాండిడ్ వీడియోను ఉపయోగించాడు. ఈ బైక్ యాక్సిలరేటర్ ఎక్కువ ఇవ్వడం ద్వారా సౌండ్ కూడా ఎక్కువ చేస్తుంది. ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ నుంచి మనం స్పోర్టి సౌండ్ వినవచ్చు.
అయితే ఈ వీడియోలో బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ కనిపించదు. బహుశా యువకుడు కావాలనే దానిని తొలగించి ఉంటాడు. వీడియోను పరిశీలించినట్లయితే యువకుడు బైక్‌ను నిర్లక్ష్యంగా నడపడం లేదని తెలుస్తుంది. కానీ హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నాడు. అయితే సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చూడడం ఇదే మొదటిసారి కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల ఇండోర్‌లోనూ ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది.

ఓ యువతి జొమాటో డ్రెస్ కోడ్, బ్యాగు ధరించి యమహా R15 బైక్‌పై హడావుడి చేసుంది. నడిరోడ్డుపై డ్రైవర్ చేస్తూ అక్కడ జనాల దృష్టిని ఆకర్షించింది. ఈ యువతి కూడా హెల్మెట్ లేకుడండా బైక్ రైడ్ చేసింది. ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
భారత్‌లో Zomato ఫుడ్ డెలివరీ విభాగంలో మహిళలు కూడా పనిచేస్తున్నారు. అయితే ఖరీదైన యమహా
బైక్‌పై జొమాటో ఫుడ్ డెలివరీ గర్ల్‌గా యువతి కనిపించడంతో ఎవరీ మోడల్ బ్యూటీ అంటూ నెటిజన్లు అవాక్కయ్యారు. అయితే ఈ యువతి జొమాటోలో పనిచేయడం లేదని.. ఈ వీడియోతో తమకు ఎలాంటి సంబంధం లేదని జొమాటో ప్రతినిధులు స్పష్టం చేశారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








