హెల్మెట్ లేకుండా యమహా R15 బైక్‌పై జొమాటో డెలివరీ గర్ల్ రైడింగ్.. సీఈవో దీపిందర్ ఏమన్నారంటే.!!
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, ఇంకా పాపులర్ అయ్యేందుకు వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు. దీని ద్వారా అనవసరంగా సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువతి జనాల దృష్టి తనపై పడేందుకు జొమాటో డ్రెస్ కోడ్‌లో యమహా R15 బైక్‌పై రోడ్డుపై చక్కర్లు కొట్టిన సంఘటన చోటుచేసుకుంది.
జొమాటో యాప్ ఆన్‌లైన్ ద్వారా కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేస్తూ చాలా పాపులర్ అయింది. అయితే జొమాటో ద్వారా ఫుడ్ డెలివరీ చేసే వారు ఎక్కువగా అబ్బాయిలే అని అందరికీ తెలిసిందే.. కానీ ఓ యువతి మాత్రం ఓ స్టైలిష్ బైక్‌పై జొమాటో బ్యాగ్, డ్రైస్ ధరించి రోడ్లపై రౌండ్లు వేస్తూ నెట్టింట్లో వైరల్ అయింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగినట్లుగా ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలుస్తోంది.

ఈ వీడియోను Inore_reelgram.official అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. వీడియోలో, జొమాటో బ్రాండింగ్‌తో కూడిన జెర్సీని ధరించి యమహా R15 బైక్‌ను నడుపుతున్న యువతిని మీరు చూడవచ్చు. అయితే ఇలా అమ్మాయిలు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలు చేయడం కొత్తేమీ కాదు. చాలా మంది ఇతర ఖర్చుల కోసం ఇలా పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు.
వీడియోను గమనించినట్లయితే యువతి రద్దీగా ఉండే రోడ్డుపై(Woman Bike Ride) యమహా R15 బైక్ నడుపుతోంది. జొమాటో డ్రెస్ కోడ్, బ్యాగుతో బైక్‌పై ఉన్న యువతి రోడ్డుపై వెళ్తుండగా.. అక్కడున్న వారు ఆమెను అలాగే చూస్తుండిపోయారు. మరికొందరు యువతిని పలు వివరాలు అడిగినట్లుగా వీడియో ద్వారా తెలుస్తోంది. మరో విషయం ఏమిటంటే ఈ యువతి హెల్మెట్ ధరించకుండా బైక్ నడపుతోంది.
అయితే ఈ అమ్మాయి Zomatoలో పని చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఆన్‌లైన్‌లో నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకే ఇలా చేసినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా జొమాటో డెలివరీ బాయ్స్ ఫుడ్ డెలివరీ సమయంలో హెల్మెట్ పెట్టుకుంటారు. రోడ్డుపై జనాల దృష్టి, నెటిజన్లను ఆకర్షించేందుకే ఇలా రోడ్డుపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో ఇది జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ దృష్టికి వెళ్లింది. ఈ వీడియోకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించారు. జొమాటోకు దీనితో ఎలాంటి ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. హెల్మెట్ లేని బైక్ రైడింగ్‌ను తాము ప్రోత్సహించబోమని చెప్పారు. అంతేకాకుండా తమకు ఇండోర్‌లో మార్కెటింగ్ హెడ్ లేదని.. ఆ యువతి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసినట్లుగా కనిపిస్తోందని ఆయన రాసుకొచ్చారు.
అయితే మహిళలు ఇలా ఫుడ్ డెలివరీ ఏజెంట్లుగా మారడంలో తప్పు లేదని దీపిందర్ గోయల్ అన్నారు. ఇది వారి కుటుంబాలకు జీవనోపాధి లాంటిదని.. ఇలాంటి జాబుల్లో చాలా మంది మహిళలు ఉన్నారని.. వృత్తి పట్ల వారి అంకితభావాన్ని చూసి గర్విస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం ఆ యువతి ఇలా చేస్తోందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. హెల్మెట్ ధరించకుండా బైక్ రైడ్ చేస్తున్నందుకు జరిమానా విధించాలని కొందరు పోలీసులను కోరారు. హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేయడం నేరమని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
హెల్మెట్ లేకుండా రైడింగ్ చేయడం చట్ట విరుద్ధమే కాకుండా ప్రాణాపాయం కూడా. హెల్మెట్ ధరిస్తే ఏదైనా ప్రమాదాలు జరిగినా తలకు గాయాలు కాకుండా కాపాడుతుంది. అయితే ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లిందా.. యువతిపై చర్యలు తీసుకున్నారా లేదా అనే సమాచారం స్పష్టంగా తెలియదు.


Click it and Unblock the Notifications








