హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ డ్రోన్ల డెలివరీలు సేవలు ప్రారంభించిన Zypp

టెక్నాలజీ నానాటికి అభివృద్ధి చెందుతూ, కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రత్యేకించి ఆటోమొబైల్ రంగం విషయానికి వస్తే, మొబిలిటీ ఇప్పుడు చాలా ఆధునికంగా మారింది. డెవలపర్లు నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. డ్రోన్లు ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. కరోనా సమయంలో కూడా రిమోట్ గా వైద్య సేవలు అందించేందుకు, మెడికల్ కిట్లను పంపిణీ చేసేందుకు డ్రోన్లను ఉపయోగించారు.

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ డ్రోన్ల డెలివరీలు సేవలు ప్రారంభించిన Zypp

డ్రోన్లను ఇప్పుడు అనేక రంగాల్లో ఉపయోగిస్తున్నారు. తాజాగా, ఇప్పుడు డెలివరీ సేవల కోసం కూడా డ్రోన్లను ఉపయోగించడం ప్రారంభించారు. బెంగుళూరు, హైదరాబాద్, ముంబై, పూణె మరియు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ నగరాలలో డెలివరీ కోసం డ్రోన్‌లు ఉపయోగించనున్నట్లు ప్రముఖ లాజిస్టిక్ కంపెనీ జ్యాప్ (Zypp) పేర్కొంది. ఎలక్ట్రిక్ డ్రోన్‌లను ఉపయోగించి భారతీయ నగరాల్లో డెలివరీలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జ్యాప్ తెలిపింది. దీంతో ఇది దేశంలో డ్రోన్ డెలివరీలను ముందుగా స్వీకరించి కంపెనీలలో ఒకటిగా నిలిచింది.

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ డ్రోన్ల డెలివరీలు సేవలు ప్రారంభించిన Zypp

జ్యాప్ ఈ ఐదు నగరాల్లో డ్రోన్ డెలివరీ సేవలను అందించేందుకు TSAW డ్రోన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా, బెంగుళూరు, హైదరాబాద్, ముంబై, పూణె మరియు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ నగరాలలో సుమారు 200 డ్రోన్‌లను మోహరించనున్నారు. డ్రోన్ డెలివరీ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన కాన్సెప్ట్. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే ఈ తరహా డ్రోన్ డెలివరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని దేశాల్లో వీటిపై ప్రయోగాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ డ్రోన్ల డెలివరీలు సేవలు ప్రారంభించిన Zypp

మనదేశంలో డ్రోన్ డెలివరీ సేవలకు ఇది ప్రారంభ దశ అని చెప్పుకోవచ్చు. రోడ్డు ద్వారా యాక్సెస్ చేయడం కష్టంగా ఉండే కొన్ని ప్రదేశాలకు చిన్న ప్యాకేజీలు, మందులు మరియు కిరాణా సామాగ్రిని పంపిణీ చేయడానికి ఇది ఉత్తమ మార్గంగా పరిగణించబడుతుంది. ఉదాహరణకు, కొండపై ఉన్న ప్రదేశంలో చాలా మలుపుల గుండా వెళ్లడానికి ఒక చిన్న స్కూటర్‌కు చాలా సమయం పట్టవచ్చు, అయితే డ్రోన్ కొన్ని నిమిషాల్లోనే ఎత్తైన కొండ ప్రాంతాలకు చేరుకొని డెలివరీ పని పూర్తి చేయగలదు.

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ డ్రోన్ల డెలివరీలు సేవలు ప్రారంభించిన Zypp

ప్రస్తుత, కోవిడ్-19 వంటి పరిస్థితుల్లో డ్రోన్ ఆధారిత డెలివరీ సేవల వలన కలిగిప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా డెలివరీ సేవలను నిర్వరిస్తున్న Zypp Electric, ఇప్పుడు వినూత్నంగా డ్రోన్ డెలివరీ సేవలం కోసం ముందుకు వచ్చింది. అయితే, ఈ డ్రోన్‌లు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను భర్తీ చేయవు కానీ వాస్తవానికి డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు ప్యాకేజీలను త్వరితగతిన గమ్యస్థానానికి పంపడంలో సహాయపడే అదనపు కనెక్టివిటీగా ఉంటాయి.

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ డ్రోన్ల డెలివరీలు సేవలు ప్రారంభించిన Zypp

జ్యాప్ ఎలక్ట్రిక్ అనేది ఓ లాస్ట్ మైల్ డెలివరీ సంస్థ, ఇది ప్రస్తుతం ప్యాకేజీలను డెలివరీ చేయడానికి ఎలక్ట్రిక్ స్కూటర్‌లను దాని ప్రాథమిక రవాణా విధానంగా ఉపయోగిస్తుంది. అయితే, ఇకపై వాటితో పాటుగా ప్యాకేజీలను వినియోగదారుల వద్దకు చేరవేయడానికి డ్రోన్‌లను కూడా ఉపయోగించనుంది. పైన పేర్కొన్న నగరాల్లో, డ్రోన్‌లు రద్దీగా ఉండే ట్రాఫిక్ పై ఎగురుకుంటూ వెళ్లి వేగంగా వినియోగదారులను చేరుకుంటాయి. ఇవి డెలివరీ భాగస్వాములకు చాలా సమయాన్ని ఆదా చేస్తాయి.

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ డ్రోన్ల డెలివరీలు సేవలు ప్రారంభించిన Zypp

ఈ సందర్భంగా జ్యాప్ ఎలక్ట్రిక్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ ఆకాష్ గుప్తా మాట్లాడుతూ.. డెలివరీ రంగంలో తమ ఎలక్ట్రిక్ వాహనాలకు కొనసాగింపుగా డ్రోన్లను ఉపయోగించనున్నామని, ఇవి మెడికల్, ఫుడ్ మరియు గ్రాసరీ ప్యాకేజీలను కస్టమర్లకు అందించడానికి తమ గ్రౌండ్ ఫ్లీట్ ఇ-స్కూటర్లకు పొడిగింపుగా జోడించబడతాయని చెప్పారు. ఇది ప్యాకేజ్ డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయడం మాత్రమే కాకుండా, ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షితమైన విధానం కూడా అవుతుందని ఆయన చెప్పారు.

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ డ్రోన్ల డెలివరీలు సేవలు ప్రారంభించిన Zypp

పైన పేర్కొన్న విధంగా, డెలివరీ కార్యకలాపాల కోసం జ్యాప్ ఎలక్ట్రిక్ TSAW డ్రోన్స్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. TSAW అనేది లాజిస్టిక్స్ కోసం డ్రోన్‌లను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగిన సంస్థ. ఈ కంపెనీ స్మార్ట్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, మానవరహిత ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ మరియు ఏఐ-సహాయక స్మార్ట్ ఫ్లీట్‌ను కూడా అందిస్తుంది. లాస్ట్-మైల్ డెలివరీ కోసం జ్యాప్ ఎలక్ట్రిక్ ఉపయోగిస్తున్న డ్రోన్‌లు ప్యాకేజీలను వేగంగా డెలివరీ చేయడంలో సహకరిస్తాయి. అయితే, ఎక్కువ సంఖ్యలో డ్రోన్లు గాలిలో ఎగురుతుంటే, అది ఎంత సురక్షితంగా ఉంటుందో వేచి చూడాలి.

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ డ్రోన్ల డెలివరీలు సేవలు ప్రారంభించిన Zypp

దేశంలో నానాటికి ఎక్కువవుతున్న కరోనా మహమ్మారి, ప్రజలను ఎంతగానో పట్టి పీడిస్తోంది. ఈ సమయంలో ప్రజలు తప్పకుండా సామాజిక దూరం వంటి వాటిని పాటించాలి. అంతే కాకుండా కరోనా మహమ్మారిని నివారించడానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించే అవకాశాలు కూడా విరివిగా కనిపిస్తున్నాయి. ఒక వేళా ఆ పరిస్థితి ఏర్పడితే కొన్ని అత్యవసర సేవలకు ఈ డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడతాయి.

Most Read Articles

English summary
Zypp starts electric drone delivery in hyderabad bangalore delhi mumbai pune details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X