కొత్త అవతారంలో హోండా డ్రీమ్ యుగా కమ్యూటర్ బైక్
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తమ డ్రీమ్ యుగా కమ్యూటర్ బైకును రెండు కొత్త రంగుల్లో అందుబాటులోకి తెచ్చారు. ఏ విధమైన ధరలను పెంచకుండా రెండు డ్యూయల్ టోన్ రంగుల్లో డ్రీమ్ యుగాను విడుదల చేసింది హోండా. సాంకేతిక మరియు ఇతర వివరాలు క్రింది కథనంలో....

ప్రస్తుతం హోండా డ్రీమ్ యుగా 110 కమ్యూటర్ బైకును బ్లాక్ మరియు అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ రంగుల్లో అందించారు.

ప్రారంభంలో ఈ డ్రీమ్ యుగా బ్లాక్ విత్ రేడియంట్ రెడ్ మెటాలిక్, బ్లాక్ విత్ హెవీ గ్రే మెటాలిక్, పియర్ల్ అమేజింగ్ వైట్, స్పోర్ట్స్ రెడ్ మరియు బ్లాక్ రంగుల్లో లభించేది.

డ్రీమ్ యుగాలో అదే 109.19సీసీ సామర్థ్యం ఉన్న గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 8.25బిహెచ్‌పి పవర్ మరియు 8.63ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్ వెనుక చక్రానికి సరఫరా చేయడానికి 4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ గల ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు.

హోండా డ్రీమ్ యుగా గరిష్ట వేగం గంటకు 86 కిలోమీటర్లుగా ఉంది మరియు ఇది లీటర్‌కు 84 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

హోండా డ్రీమ్ యుగా ప్రస్తుతం ధర రూ. 51,499 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

హోండా వారి డ్రీమ్ యుగా కమ్యూటర్ బైకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న యమహా సెల్యూటో, సుజుకి హయాతే ఇపి, హీరో సూపర్ స్ల్పెండర్ మరియు టీవీఎస్ పీనిక్స్‌కు పోటీగా ఉంది.

సముద్ర గర్భంలో కదిలే రహదారి సొరంగం
4:30 గంటల్లో ముంబాయ్ నుండి న్యూయార్క్ నగరాన్ని చేరుకోండిలా !


Click it and Unblock the Notifications








