ఫేస్‌బుక్ వీడియో ఆఫ్ ది డే: నైట్రో సర్కస్ - అల్టిమేట్ యాక్షన్
డ్రైవ్‌స్పార్క్ పాఠకులకు ఎల్లప్పుడూ ఆటోమొబైల్ రంగానికి చెందిన రెగ్యులర్ వార్తా కథనాలే కాకుండా, అప్పుడప్పుడూ కాస్తంత వినోదాన్నిచ్చేవిధంగా 'నేటి ఫేస్‌బుక్ వీడియో' (Facebook video of the day) శీర్షిక పేరిట రోజు ఓ వినోదాత్మక, ఉపయోగాత్మక వీడియోను పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాం.
ఈ నేపథ్యంలో నేటి ఫేస్‌బుక్ వీడియోలో మనం నైట్రో సర్కస్ బృందం వాళ్లు వాహనాలతో చేసిన పలు డేర్‌డెవిల్ స్టన్నింగ్ స్టంట్స్‌ను చూద్దాం రండి. నైట్రో సర్కస్ రెగ్యులర్ సర్కస్‌లతో పోల్చుకుంటే భిన్నంగా ఉంటుంది. ఆ వ్యత్యాసం ఏంటంటే, ఈ స్టంట్‌లను చేసే సభ్యులు పూర్తిగా విభిన్నమైన లీగ్‌లో చేస్తారు.
ఇందులో వీరు చేసే ప్రతి స్టంట్ కూడా అత్యధిక రిస్కుతో కూడుకున్నవే. నైట్రో సర్కస్‌ను స్థాపించింది ట్రావిస్ అలన్ పాస్ట్రానా. ఇతనొక ప్రొఫెషనల్ మోటార్‌స్పోర్ట్స్ కాంపిటీటర్ మరియు ఓ స్టంట్ పెర్ఫార్మర్. తాను చేసిన అనేక డేర్‌డెవిల్ స్టంట్స్‌కు అత్ని అనేక జాతీయ అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లు వరించాయి.
నైట్రో సర్కస్ ట్రూప్ లైవ్ పెర్ఫార్మెన్సులతో పాటుగా పలు టివి సిరీస్‌లు మరియు ఓ 3డి ఫీచర్ సినిమాలో కూడా స్టంట్స్ చేసింది. మరి ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!


Click it and Unblock the Notifications