భవిష్యత్ మొత్తం వీటిదే: టీవీఎస్ మోటార్స్

నగరాల్లో నివసించే యువకులు శక్తివంతమైన, విభిన్న తీరులో మరియు విన్నూత్న శైలిలో ఉండే బైకులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అని టీవీఎస్ మోటార్స్ తమ అకులా 310 బైకును దృష్టిలో ఉంచుకుని తెలిపింది.

By Anil

టీవీఎస్ మోటార్స్ తమ 310సీసీ సామర్థ్యం ఉన్న అకులా బైకు విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఇండియన్ మార్కెట్లోకి అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ప్రీమియర్‌ బైకును ఈ ఏడాదిలో విడుదల చేసింది. వీటి దృష్ట్యా భవిష్యత్ ప్రీమియ్ బైకులదే అని తెలిపింది.

టీవీఎస్ అకులా 310

టీవీఎస్ మోటార్స్ మార్కెటింగ్ విభాగం యొక్క వైస్ ప్రెసిడెంట్ అరుణ్ సిద్దార్థ్ మాట్లాడుతూ, నగరాల్లో నివసించే యువత ఎక్కువగా శక్తివంతమైన, విభిన్న తీరులో మరియు విన్నూత్న శైలిలో ఉండే బైకులను ఎంచుకుంటున్నారని తెలిపారు.

టీవీఎస్ అకులా 310

కాబట్టి 150 సీసీ నుండి ఎక్కువ సామర్థ్యం ఉన్న ప్రీమియమ్ బైకులతో భవిష్యత్ అని చెప్పుకొచ్చాడు. తమ అపాచే ఆర్‌టిఆర్ 200సీసీ ఉత్పత్తుల విక్రయాల్లో కూడా వృద్ది పెరిగినట్లు తెలిపాడు.

టీవీఎస్ అకులా 310

అరుణ్ సిద్దార్థ్ మాట్లాడుతూ, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి టీవీఎస్ అకులా 310సీసీ ని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపాడు.

టీవీఎస్ అకులా 310

టీవీఎస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ సంస్థలు భాగస్వామ్యంలో మరిన్ని ఉత్పత్తులు ఊపిరిపోసుకుంటున్నాయి. అందులో విడుదలకు సిద్దమవుతున్న జి310ఆర్ ఒకటి.

టీవీఎస్ అకులా 310

ఈ జి310ఆర్ బైకులో 313సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్‌ను అందించారు. ఇది సుమారుగా 34బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

టీవీఎస్ అకులా 310

టీవీఎస్ అకులా మార్కెట్లోకి విడుదల అయితే యమహా ఆర్3, నింజా 300 మరియు కెటిఎమ్ ఆర్‌సి 390 వంటి ఉత్పత్తులకు గట్టి పోటీని ఇవ్వనుంది.

టీవీఎస్ అకులా 310

  • బిఎమ్‌డబ్ల్యూ నుండి అత్యంత చౌకైన 125సీసీ బైకు

Article Published On: Saturday, November 5, 2016, 17:46 [IST]
English summary
TVS Motor: Premium Motorcycles Are The Future
Read more on: #టీవీఎస్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+