జులై 13, 2014న 12వ అంతర్జాతీయ జావా యెజ్ది డే
నిజమైన మోటార్‌సైకిల్ ప్రియులకు యెజ్ది, జావా మోటార్‌సైకిళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే, కొత్త తరం కోసం భారత ద్విచక్ర వాహన చరిత్రలో ఓ ప్రత్యేక ఘట్టంగా నిలిచిపోయిన ఈ మోటార్‌సైకిళ్లకు సంబంధించిన కూసింత సమాచారం తెలుసుకుందాం రండి. మైసూరులోని ఐడీల్ జావా (ఇండియా) లిమిటెడ్ కంపెనీ 1960 నుంచి 1996 వరకు ఈ బైక్‌లను ఉత్పత్తి చేసేది.
చరిత్రలో మిగిలిపోయిన ఈ బైక్‌లు అదికొద్ది మంది దగ్గర మాత్రమే ఇంకా సజీవంగా ఉన్నాయి. అలాంటి పురాతన బైక్‌లను అన్నింటినీ ఒకేచోట చూసే భాగ్యం మనకు 12వ అంతర్జాతీయ జావా యెజ్ది ద్వారా కలగనుంది. జులై 13, 2014వ తేదిన బెంగుళూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో అనేక మంది జావా, యెజ్ది యజమానులు తమ బైక్‌లను ప్రదర్శనకు ఉంచనున్నారు.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో అంతర్జాతీయ జావా యెజ్ది డేకి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా జులై నెలలో రెండవ ఆదివారాన్ని అంతర్జాతీయ జావా, యెజ్ది డేగా జరుపుకుంటారు.

జావా, యెజ్ది బ్రాండ్‌లలో 175సీసీ, 250సీసీ, 350సీసీ బైక్‌లు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఇది వరకు చెప్పుకున్నట్లుగానే, భారత్‌లో వీటిని మైసూర్‌లో 1960 నుంచి 1996 వరకు ఉత్పత్తి చేశారు.

వీటిలో ప్రత్యేకించి 250సీసీ జావా, యెజ్ది బైక్‌ల ట్విన్ ఎగ్జాస్ట్స్ (రెండు సైలెన్సర్స్) వచ్చే సౌండ్‌కు ఇప్పటికీ వేలాది మంది అభిమానులు ఉన్నారు.

ఈ ఏడాది బిజెవైఎమ్‌సి (బెంగుళూరు జావా యెజ్ది మోటార్‌సైకిల్ క్లబ్) ఈ వార్షిక సమావేశాన్ని బెంగుళూరులోని హంబెగౌడ స్కూల్ గ్రౌండ్, 10వ క్రాస్, విల్సన్ గార్డెన్ వద్ద నిర్వహించనుంది.

ఇందులో భాగంగా, ఈ బైక్‌లో ర్యాలీ కూడా నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ జులై 13, 2014వ తేది ఉదయం 10.30 లకు హంబెగౌడ స్కూల్ గ్రౌండ్ నుండి ప్రారంభమైన మైసూర్ రోడ్‌పై ఉన్న రాస్టా కెఫే వరకు దాదాపు 40 కి.మీ. దూరం సాగుతుంది.

బైకింగ్ ప్రియులకు మరియు బైక్‌లను కలెక్ట్ చేసే వారికి మరియు పురాతన జావా రైడర్లు అలాగే ఐడీల్ జావా ఫ్యాక్టరీ ఉద్యోగులతో మాటామంతీ కలుపుకునేందుకు ఈ కార్యక్రమం ఓ చక్కటి వేదిక కానుంది.

బిజెవైఎమ్‌సి (బెంగుళూరు జావా యెజ్ది మోటార్‌సైకిల్ క్లబ్) 2007వ సంవత్సరం నుంచి మనుగడలో ఉంది. ఈ క్లబ్ పురాతన జావా, యెజ్ది బైక్‌లన్నింటినీ ఒక్క చోటకు చేర్చి మనకు వీనుల విందు ఇచ్చేందుకు కృషి చేస్తోంది.

బెంగుళూరులో ఇప్పటికీ దాదాపు 600 లకు పైగా జావా, యెజ్ది మోటార్‌సైకిళ్లు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఈ బైక్‌లంటే ఇష్టపడే వారిని వీటిని ఎప్పటికప్పుడు మరమ్మత్తు చేయించుకుంటూ కండిషన్‌లో ఉంచుకున్నారు.

ఈ బైక్‌లలో కొన్ని ఇంపోర్టెడ్ జావా పెరాక్స్, సిజెటాస్, 350 జావా ట్విన్స్ వంటి బైక్‌లు కూడా ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు లోకేషన్ జెఎమ్ 9880033994 లేదా అమిత్ అప్పయ్య 9880105455 లను సంప్రదించవచ్చు. లేదంటే ఫేస్‌బుక్ గ్రూప్ Bangalore Jawa Yezdi Motorcycle Club ను సందర్శించవచ్చు.


Click it and Unblock the Notifications








