మీ కారును పదిలంగా వుంచుకోవడానికి ఐదు చిట్కాలు...!!

By

GDC Front
సమస్య పరిష్కారానికన్నా సమస్య నివారణ ఉత్తమం అన్న సత్యం మన జీవనావళిలో ప్రతి నిత్యం ఉపయోగపడుతుంది. ఇదే సూత్రాన్ని మీ కార్లను ఉపయోగించడంలో కూడా పాటిస్తే మీ కారు మన్నిక పెరిగి దీర్ఘకాలం పాటు మీకు దారిని చూపుతుంది. దీనికోసం మీరు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ కారును ఉపయోగించేటప్పుడు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు.

మీ కోసం, మీ కారు మన్నిక కోసం ఈ ఐదు చిట్కాలు పాటించి చూడండి:

1. కంపెనీ వారు సూచించిన సర్వీసింగ్ షెడ్యూల్ ను క్రమం తప్పకుండా పాటించండి. మీ వాహనాన్ని సరైన సమయంలో సర్వీసింగ్ కు ఇచ్చి అనవసరమయిన ఇబ్బందులను నివారించండి. ప్రతీ కంపెనీ వాహన పరిరక్షణకై కొన్ని సూచనలను ఇస్తుంది. ఈ సూచనలను క్రమం తప్పకుండా పాటిస్తే, రీపేరీలకు అనవసరమయిన ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.

2. మీ కారు టైర్లకు ఉన్న ట్యాబులను సరిగా వున్నయో లేదో పరీక్షించండి. టైర్లలో గాలి సరిగా వుందో లేదో అని ప్రతిరోజూ వీలుకాకపోయినా, రెండు రోజులకో సారి అయినా గమనించాల్సిన అవసరం వుంది. కంపెనీ ఇచ్చిన సూచనల ప్రకారం టైర్లలో పీడనం వుందో లేదో గమనించుకుంటూ వుంటే మీ కారు టైర్లు ఎక్కువ కాలం మన్నిక వస్తాయి.

3. కొంత మందికి కారు స్టార్ట్ చేస్తూనే ముందుకు దూసుకెళ్లిపోవడం అలవాటు. 5 గంటలకు మించి ఆఫ్ లో వున్న ఇంజిన్ లోని ఆయిల్ సంప్ మీద నిలిచిపోయి వుంటుంది. ఇలాంటి సమయంలో ముందుకు దూసుకెళ్లిపోవడం ద్వారా ఇంజన్ దెబ్బతింటుంది. మరి కొంత మంది కారు స్టార్ట్ చేస్తూనే రైజ్ చేస్తారు అది కూడా ఇంజన్ కు దెబ్బే. కారు స్టార్ట్ చేసి ఓ నిమిషం పాటు అలానే వుంచేసి, ఆ తర్వాత ముందుకెళ్లడం మంచిది. ఇలా చేస్తే ఇంజన్ లోని ఆయిల్ అన్ని భాగాలకూ సమంగా పరచుకొని ఇంజన్ మన్నిక పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

4. మంచి డ్రైవర్ గా వుండటం మీకు మాత్రమే కాదు మీ కారు ఇంజన్ కూడా క్షేమం. రోడ్డు మీద వెళ్లేప్పుడు మైఖేల్ షూమాకర్ లా దూసుకుపోకండి. అది ఇంజన్ మీద ఒత్తిడి పెంచి దాని జీవిత కాలాన్ని కుదించివేస్తుంది. కాబట్టి కారు నడుపుతున్నప్పుడు మీతో పాటు ఇంజన్ ను కూడా దృష్టిలో పెట్టుకుంటే చాలు.

5. నేటి మార్కెట్ లో రోజుకో కొత్త ఇంధన తయారీ కంపెనీలు వస్తున్నాయి. అలా అని ఏ ఇంధనం పడితే అది వాడితే అది మీ కారు జీవితకాలాన్ని తగ్గించివేస్తాయి. మీ కారుకు ఏ ఇంధనం సరియైనదో కారు సర్వీసు సెంటర్లో అడిగి అదే ఇంధనాన్ని వాడటం శ్రేయస్కరం.

More from DriveSpark

Article Published On: Thursday, December 10, 2009, 17:25 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+