కేక పెట్టించే మోడల్ కవాసాకి నింజా 250R మోటర్ బైక్

ఈ సూపర్ బైకు పేరుకు తగ్గట్టుగానే 249 సిసి సామర్థ్యం గల ఇంజన్ తో రూపొందించబడిందని, 42.5 కిలో మీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. బజాజ్ వారి చకాన్ ప్లాంట్ సిద్ధం అయ్యాక ఇండియాలోని 22 నగరాలలో గల బజాజ్ షోరూం లలో ఈ బైకును విక్రయించనున్నారు. మరో మూడు వారాల్లో ఈ సూపర్ బైకు ఇండియాలో ప్రధాన నగరాలయిన న్యూ ఢిల్లీ, చెన్నై లలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతానికి ఈ బైకు ఎక్స్-షోరూం (ex-showroom) ధర ఢిల్లీలో 2,69,970 రూపాయలు, చెన్నైలో 2,69,580 గా వుంది. మరింకెందు ఆలస్యం వెంటనే ఈ బైకు కొనేసి రయ్ మంటూ దూసుకుపోవడానికి సిద్ధం కండి.


Click it and Unblock the Notifications








