కేక పెట్టించే మోడల్ కవాసాకి నింజా 250R మోటర్ బైక్

By

Bajaj Kawasaki Ninja 250R
బజాజ్ ఆటోమొబైల్ కంపెనీ సరికొత్త సూపర్ బైకును భారతీయ మార్కెట్ లోకి ప్రవేశ పెట్టింది. కవాసాకీ నింజా 250R గా మార్కెట్ లోకి విడుదలయిన ఈ బైకును జపాన్ కు చెందిన కవాసాకీ హెవీ డ్యూటీ ఇండస్ట్రీస్ రూపొందించింది. ఈ సంధర్భంగా కవాసాకీ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ మాట్లాడుతూ ఏడాదికి 1,000 బైకులను అమ్మడమే తమ ముందున్న లక్ష్యం అని చెప్పారు. ఈ సూపర్ బైకు ఆకు పచ్చ, నలుపు రంగుల్లో లభ్యం అవుతుంది.

ఈ సూపర్ బైకు పేరుకు తగ్గట్టుగానే 249 సిసి సామర్థ్యం గల ఇంజన్ తో రూపొందించబడిందని, 42.5 కిలో మీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. బజాజ్ వారి చకాన్ ప్లాంట్ సిద్ధం అయ్యాక ఇండియాలోని 22 నగరాలలో గల బజాజ్ షోరూం లలో ఈ బైకును విక్రయించనున్నారు. మరో మూడు వారాల్లో ఈ సూపర్ బైకు ఇండియాలో ప్రధాన నగరాలయిన న్యూ ఢిల్లీ, చెన్నై లలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతానికి ఈ బైకు ఎక్స్-షోరూం (ex-showroom) ధర ఢిల్లీలో 2,69,970 రూపాయలు, చెన్నైలో 2,69,580 గా వుంది. మరింకెందు ఆలస్యం వెంటనే ఈ బైకు కొనేసి రయ్ మంటూ దూసుకుపోవడానికి సిద్ధం కండి.

Most Read Articles

Story first published: Friday, October 16, 2009, 14:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X