'చిన్న(లక్ష) కార్ల' భద్రతా ప్రశ్నార్థకమేనా??

ఇప్పటి వరకూ టూ-వీలర్, త్రీ-వీలర్ వాహనాలను మాత్రమే రూపొందించిన బజాజ్ ఆటో వారికిది తొలి ఆటో కారు ప్రాజెక్టు కావడం గమనార్హం. 2,500 డాలర్లు విలువ చేసే ఈ కారు ధరను అదుపులో వుంచడానికి టూ-వీలర్, త్రీ-వీలర్ ఇంజన్ లకు ఉపయోగించే పరికరాలనే ఈ కారు రూపొందించడానికి ఉపయెగిస్తున్నారట. కానీ ఈ పరికార వల్ల కారుకు ఎలాంటి భద్రతా సమస్యలు రాబోవని కంపెనీ వర్గాలకు చెందిన ఓ వ్యక్తి వివరణ ఇచ్చారు. చూస్తుంటే చిన్న కారు మోజులో, ధర తగ్గించాలనే ప్రయత్నంలో చివరికి సైకిల్ ముడి భాగాలు కారులో ఉపయోగించినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ ఈ ముడిభాగాల వల్ల కారు భద్రత గాలిలో దీపం లాంటిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దానికి నిదర్శనమే ఇటీవల చోటుచేసుకున్న టాటా నానో కారులో షార్ట్ సర్యూట్ ప్రమాదాలని వారు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications








