హీరో హోండా 'స్ల్పెండర్' అరుదైన రికార్డు...!!

25 ఏళ్ల ముందు ప్రారంభమయిన ఈ కంపెనీ నుండీ 1994, జనవరిలో తొలి స్ల్పెండర్ బైకు విడుదలయింది. తొలుత ఆదరణ అంతంతమాత్రంగానే వున్న ఈ బైకు ఆ తర్వాత రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధిస్తుందని ఎవ్వరూ ఊహించి వుండరు. విడుదలయిన పది మాసాల తర్వాత నవంబరు నెలలో ఈ స్ల్పెండర్ బైకు అమ్మకాలు ఊపందుకున్నాయి. ఆ తర్వాత హీరో హోండా ల్యాండ్ మార్క్ గా స్ల్పెండర్ బైకు ఎదిగింది. కేవలం పది మాసాల్లోనే 1 మిలియన్ మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేసి రికార్డును సృష్టించింది.
గత 15 సంవత్సరాల నుండీ ఈ బైకు ఉత్పత్తి అవుతున్నా....!! ఇప్పటికీ ఏ మాత్రం ఆదరణ తగ్గకుండా ఈ బైకు ఉత్పత్తి సాగుతూనే వుంది. 100 సిసి బైకుల విభాగంలోని బైకులకు మార్గదర్శిగా నిలిచిన ఈ బైకు ఎన్ని కొత్త మోడళ్లు వస్తున్నా విభిన్నమయిన ఫీచర్స్ తో ఏ మాత్రం ఆదరణ తగ్గకుండా ముందుకు సాగుతూ మరిన్ని రికార్డులు సృష్టించేందుకు సన్నద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications








