3 మిలియన్ల అమ్మకాలతో 'హీరో హోండా'

ఈ సందర్భంగా హీరో హోండా మార్కెటింగ్ & సేల్స్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ దువా మాట్లాడుతూ "కంపెనీ 300,000 యూనిట్ల అమ్మకాలను చేరుకోవడం ఇది వరుసగా 11వ సారి అని, ఇది ఇలాగే కొనసాగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. గత నవంబరు నెలలో కంపెనీ మూడు మిలియన్ల అమ్మకాల మార్కును చేరుకుందని, త్వరలోనే నాలుగు మిలియన్ల అమ్మకం మార్కుని చేరుకోనుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు."
మొత్తంగా చూస్తే ఈ ఏడాది కంపెనీ అమ్మకాలు 21% వృద్ధిని నమోదు చేసుకున్నాయి. గత ఏడాది నవంబరు వరకూ 23,08,214 యూనిట్ల అమ్మకాలు జరుగగా, ఈ ఏడాది అది 30,37,556 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. కాగా కంపెనీ లోని అన్ని సెగ్మెంట్లు లాభాల బాటన నడుస్తున్నట్టు కూడా దువా తెలియజేసారు. 100 సిసి బైకుల సెగ్మెంట్లో 20%, 150 సిసి బైకుల సెగ్మెంట్లో 30%, స్కూటర్ల సెగ్మెంట్లో 40% వృద్ధిని నమోదు చేసుకున్నట్టు ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








