భారతీ విపణిలోకి హోండా CB ట్విస్టర్..!!

By

Honda CB Twister
ప్రముఖ జపాన్ ఆటోమొబైల్ కంపెనీ హోండా, భారతీయ కంపెనీ హీరోతో కలసి రెండు దశాబ్దాలుగా టూ-వీలర్ ప్రపంచాన్ని ప్రపంచాన్ని తిరుగులేని 'హీరో'లు గా ఏలుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పడు హోండా కంపెనీ హీరో బ్రాండ్ లేకుండా ఓ 110 సిసి బైకును భారతీయ విపణిలోకి విడుదల చేసింది. 'ట్విస్టర్' పేరుతో రూపొందిన ఈ బైకును ఇటీవలే న్యూ ఢిల్లీలో విడుదల చేసింది హోండా కంపెనీ.

హోండా వారి CB1000R బైకు మోడల్ ను పోలివున్న ఈ మోడల్ అధనపు ఫీచర్స్ తో విడుదలయింది. రెండు దశాబ్దాలుగా 100 సిసి, 110 సిసి బైకులను ఉత్పత్తి చెయ్యడంలో అగ్రగామిగా నిలిచిన హీరో హోండా కు పోటీగా ఈ హోండా బైకు విడుదలయిందనే వార్తలను హోండా కంపెనీ వర్గాలు కొట్టిపారేసాయి. అసలు ఈ బైకు హీరో హోండా కు ఏ మాత్రం పోటీ కాబోదని, ఎవరి మార్కెట్ వారికి ఉంటుందని, ఈ సరికొత్త బైకు ఖచ్చితంగా జనాధరణ పొందుతుందనే ఆశాభావాన్ని కంపెనీ వర్గాలు వ్యక్తం చేసాయి.

110 సిసి సింగల్ సిలిండర్ ఇంజన్ తో రూపొందిన ఈ బైకు లీటరుకు 70 కి.మీల మైలేజీని ఇస్తుంది. కాగా ఈ 110 సిసి బైకు 'ట్విస్టర్' ఎక్స్ షో-రూం ధర ఢిల్లీలో 42,000/- గా నిర్ణయించారు.

More from DriveSpark

Article Published On: Monday, December 14, 2009, 12:01 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+