బ్రిటీష్ ఇంజనీరింగ్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ల తయారీకి పేరొందిన సంస్థ. రాజసం ప్రతిబింబించే బుల్లెట్ వాహనాలను తయారుచేయడంలో రాయల్ ఎన్ఫీల్డ్ కు తిరుగేలేదు. అలాంటి సంస్థ తాజాగా ఓ క్లాసిక్ బుల్లెట్ ను విడుదల చేసింది. పాత తరం బుల్లెట్ మోడల్ ను ప్రతిబింబించే ఈ మోడల్ రెండు రకాల ఇంజన్లతో మార్కెట్ లోకి అందుబాటులోకి తెచ్చింది రాయల్ ఎన్ఫీల్డ్. బుల్లెట్ క్లాసిక్ 350 మరియు బుల్లెట్ క్లాసిక్ 500 పేర్లతో ఈ బుల్లెట్ లు మార్కెట్ లోకి విడుదలయ్యాయి. ఇందులో బుల్లెట్ క్లాసిక్ 350, ఇంతకు ముందు విడుదలయిన థండర్ బర్డ్ ట్విన్ స్పార్క్ మోటార్ సైకిల్ ఇంజన్ తోనే రూపొందింది కాగా, బుల్లెట్ క్లాసిక్ 500 రాయల్ ఎన్ఫీల్డ్ 500 సిసి ఫ్యూయల్ ఇంజెక్టెట్ యూనిట్ కంస్ట్రక్టడ్ ఇంజన్ తో రూపొందింది.
ఈ బుల్లెట్ల ఎక్స్ షో-రూం ధరలు న్యూ ఢిల్లీలో ఈ విధంగా వున్నాయి:
మోడల్ ధర
బుల్లెట్ క్లాసిక్ 350 Rs 98,000
బుల్లెట్ క్లాసిక్ 500 Rs 1.24 లక్షలు
రోడ్డు పైన రాజసం ఉట్టిపడే వాహనంలో పరుగులు తీయాలనుకుంటున్నారా...!! ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ బుల్లెట్ ను మీ సొంతం చేసుకోండి.