సూపర్ బైకులు వచ్చేస్తున్నాయి..!!

త్వరలోనే సుజుకి మోటార్ సైకిల్స్ 8 లక్షల విలువచేసే సూపర్ బైకును, యుయస్ హార్లే డేవిడ్ సన్ కూడా ఓ సూపర్ బైకులను భారతీయ మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకురావడ్నికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ కంపెనీలు యమహా, హోండా, డుక్యాటీ మరియు కవాసాకీ లాంటి కంపెనీలు 10 నుండీ 15 లక్షల విలువ చేసే బైకులను అందుబాటులోకి తీసుకువచ్చాయి.
సుజుకి త్వరలోనే గ్లాడియస్ అనే సూపర్ బైకును విడుదల చెయ్యనుంది. వి-ట్విన్ 645 సిసి ఇంజన్ తో రూపొందిన ఈ రెండు సిలెండర్ల స్ట్రీట్ బైకు ఆకర్షించే స్పోర్ట్ లుక్ తో రూపొందినది. దీని ధరను సుమారు 7 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. దీంతో పాటు మరో 500+ సిసి ఇంజన్ తో రూపొందిన బైకును కూడా సుజుకి మోటార్స్ విడుదల చెయ్యనుంది.
ఇప్పటికే హోండా, యమహా వంటి మోటార్ సైకిల్ కంపెనీలు 696 సిసి నుండీ 1670 సిసి రేంజిలో 10 నుండీ 456 లక్షలు విలువ చేసే బైకులను విడుదల చేసారు. త్వరలోనే హోండా 1200 సిసి VFR బైకును యుయస్, యూరప్ దేశాల్లో విడుదల చెయ్యనుంది. యమహా ఇప్పటికే 12.5 లక్షల విలువ చేసే YZF-R1 ను మార్కెట్ లోకి విడుదల చేసారు.


Click it and Unblock the Notifications








