టివియస్ ను గట్టెక్కించిన స్థానిక అమ్మకాలు, ముంచేసిన ఎగుమతులు...!!

By

TVS
ప్రముఖ టూ-వీలర్ కంపెనీ టివియస్ మోటార్స్ గత నవంబరు నెలకు గాను జరిగిన అమ్మకాల్లో 23% వృద్ధిని నమోదుచేసుకున్నట్టు ప్రకటించింది. నెలకు 1.20 లక్షలకు పైగా వాహనాలను అమ్మడం టివియస్ కు వరుసగా ఇది ఎనిమిదవ సారి. గత సంవత్సరం నవంబరు నెలకు గాను కంపెనీ 98,402 యూనిట్లను అమ్మగా ఈ ఏడాది అది 23% పెరుగుదలను నమోదు చేసుకొని 1,20,844 యూనిట్లను అమ్మినట్టు ఈ ప్రకటనలో వెలువరించింది.

కాగా స్థానిక అమ్మకాల్లో పెరుగుదలను నమోదుచేసుకున్న కంపెనీ, ఎగుమతుల్లో తగ్గముఖం పట్టినట్టు నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం గత సంవత్సరం స్థానిక అమ్మకాలు 77,491 గా వుండగా, ఈ ఏడాది అది 1.06 లక్షల యూనిట్లకు పెరిగింది. కానీ ఎగుమతుల సంఖ్య మాత్రం క్రితం సంవత్సరం సంఖ్యతో పోల్చితే తగ్గుముఖం పట్టింది. గత ఏడాది 20,911 గా వున్న ఈ సంఖ్య, ఈ ఏడాది 14,008 కి పడిపోయింది. కానీ స్థానిక అమ్మకాల పెరుగుదల వల్ల 23% వృద్ధిని నమోదుచేసుకోగలిగింది. టివియస్ కంపెనీ నుండీ రాబోవు వాహనాలు మార్కెట్ లోకి విడుదలయ్యాక ఈ వృద్ధి మరింత పెరిగే అవకాశం వుందని కంపెనీ వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేసాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, December 2, 2009, 10:35 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+