భారతీయ లీడింగ్ టూ-వీలర్ కంపెనీ టివియస్ మోటార్స్ తమ సంస్థ నుండీ రాబోతున్న ట్విన్ స్పార్క్ ప్లగ్ 'ఫ్లేమ్' బైకుని తిరిగి మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ఈ ట్విన్ స్పార్క్ ప్లగ్ బైకులో స్వ్రిల్ మరియు టంబుల్ అనే రెండు పోర్ట్ లు వుంటాయని, ఇవి బండి కండీషన్ ను, ఇంధన వినియోగాన్ని అదుపులో వుంచుతాయని, వీటి వల్ల బైకు లైఫ్ మెరుగవ్వడమే కాకుండా మంచి మన్నికను ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ని ఫీచర్స్ వున్న ఈ బైకు ధరను 49,200గా నిర్ణయించారు.
ఇదిలా వుండగా ఈ బైకును మార్కెట్ లోకి విడుదల చెయ్యకూడదని బజాజ్ ఆటో సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కానీ కోర్టు ఆ పిటీషన్ ను కొట్టివేసి టివియస్ 'ఫ్లేమ్' కు మార్గం సుగమం చేసిన తర్వాత ఈ బైకును రీ-లాంచ్ చేసారు. ప్రస్తుతం దక్షణ భారతంలో ఈ బైకు లభించనుంది. త్వరలోనే మిగితా రాష్ట్రాలలో కూడా రీ-లాంచ్ చెయ్యనున్నట్టు కంపెనీ వర్గాలు ప్రకటించాయి.