ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ అల్ట్రా మోటర్ ఇండియా రెండు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల ను మార్కెట్ లోకి విడుదల చేసింది. అల్ట్రా ఫన్, అల్ట్రా శక్తి పేర్లతో విడుదలయిన ఈ స్కూటర్లను నడపటానికి లైసెన్స్ అవసరం లేకపోవడం విశేషం. ఇక అల్ట్రా శక్తి స్కూటర్ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ డ్రివన్ తో, 250W మోటార్ తో తయారయింది. ఈ స్కూటర్ ప్రత్యేకంగా పర్వత ప్రాంతాల్లో నడపడానికి అనువుగా రూపొందించారు.
ఇక మరో స్కూటర్ అల్ట్రా ఫన్ కూడా లో-స్పీడ్ ఎలక్ట్రిక్ డ్రివన్ తో, 250W మోటార్ తో తయారయింది. తక్కవ బరువుతో మహిళలకి, పిల్లలకి నడపడానికి అనువుగా ఈ స్కూటర్ రూపొందింది. ఎరుపు, సిల్వర్ మరియు మెటాలిక్ పర్పల్ రంగుల్లో లభ్యమయ్యే ఈ స్కూటర్ల ఎక్స్-షోరూం ధర 29,900 రూపాయలు మాత్రమే.