12.5 లక్షల యమహా సూపర్ బైక్

ఈ మోడల్ లో యమహా డీఎన్ఏ-పర్ఫార్మెన్స్, ఇన్నోవేషన్, డిజైన్ వంటి మూడు వెర్షన్ ను తీసుకువచ్చింది. ఈ సరికొత్త బైక్ ఢిల్లీ, ముంబై, పూణే, కోల్ కతా వంటి 13 నగరాల్లో 24 అధీకృత డీలర్ల వద్ద అందుబాటులో వుంటుందని కంపెనీ సీఈఓ, ఎండి యుకి మైన్ సుజి పేర్కొన్నారు. భవిష్యత్తులో సైతం మంచి టెక్నాలజీతో పాటు అర్టిస్టిక్ బ్రిలియన్స్ కలగలసిన ఈ బైకులు భారత్ లోని ఉత్సాహవంతుల అభిరుచికి అనుగుణంగా తయారు చేసినట్టు ఆయన వెళ్లడించారు. కాగా ఈ బైకులు యమహా బ్లూ, మెటాలిక్ బ్లూ, నీలం కలసిన తెలుపు రంగుల్లో లభ్యమవుతాయి.


Click it and Unblock the Notifications








