జపాన్ కు చెందిన టూ-వీలర్ కంపెనీ యమహా ఓ కొత్త బైక్ ను మార్కట్ లోకి విడుదల చేసింది. 'VMAX' పేరుతో విడుదలైన ఈ బైక్ ధర అక్షరాలా 20 లక్షలు. ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు జాన్ అబ్రహమ్ ఈ బైక్ ను ఆవిష్కరించారు. 1679cc ఇంజన్ తో నడిచే ఈ బైక్ ప్రపంచంలోనే అధిక వేగంతో ప్రయాణించగల టూ-వీలర్. దీంతో పాటు Yamaha-FZ సీరీస్ బైకులను కూడా విడుదల చేసింది.
ఈ సందర్భంగా యమహా మ్యానేజింగ్ డైరెక్టర్ యుకీ మాట్లాడుతూ తమ సంస్థ నుండీ వస్తోన్న ఈ బైక్ కు ఇంతకు ముందు రిలీజ్ చేసిన మోడల్స్ లాగే మంచి స్పందన వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. కుర్రకారుని లక్ష్యంగా చేసుకొని డిజైన్ చేసిన ఈ మోడల్ కి యూత్ లో మంచి స్పందన వస్తోంది.