బజాజ్ కెటియమ్ ద్వారా తిరిగి యధాస్దానానికి..

బజాజ్ కంపెనీ ప్రస్తుతం తన యొక్క శ్రద్దనంతా బజాజ్ కెటియమ్ బైక్స్ మీదనే పెట్టడం జరిగిందని అన్నారు. బజాజ్ కెటియమ్ ఇంజను సామర్ద్యం కాని, దాని యొక్క సామర్ద్యం జాతీయంగా మరియ గ్లోబల్ గాబజాజ్ కుపేరు ప్రఖ్యాతులు తెచ్చేవిధంగా రూపోందించడం జరిగిందని అన్నారు. బజాజ్ మరియు కవాసికీ ఇద్దరూ కలసి గతంలో కూడా చాలా ప్రోడక్ట్స్ రూపోందించడం జరిగింది. ఐతే ప్రస్తుతానికి ఇరు కంపెనీలు కలసి మరో కంపెనీ అయినటువంటి జెవి నుండి నింజా 250 స్పోర్ట్స్ బైక్ ఇప్పటికే దాదాపుగా 1000యూనిట్లు అమ్మడం జరిగిందని వివరించారు.
బజాజ్ కంపెనీ యమ్ డి మాట్లాడుతూ ఇలా ఇంజను షేరింగ్ చేసుకోవడం వల్ల ప్రోడక్షన్ ఖర్చు తగ్గంచడానికి వీలుగా ఉంటుందని అన్నారు. దీనివల్ల యూనిట్ ప్రైస్ మీద ప్రభావం పెద్దగా ఉండదని అన్నారు. కవాసికీ బజాజ్ డీలర్స్ ద్వారా ఇండియాలో బిజినెస్ చేస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా బజాజ్ కూడా కవాసికీ ద్వారా గ్లోబల్ గాతన బిజినెస్ కూడా వ్యాప్తిచేసుకుంటుంది. బజాజ్ చకాన్ ప్లాంటు నుండే కెటియమ్ మరియు కవాసికీ బైక్స్ డిజైన్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తతానికి బజాజ్ కంపెనీ ఫిలిప్పేన్స్ మరియు కోలంబియా ఆటో మార్కెట్స్ లోబిజినెస్ చేస్తున్న విషయం తెలిసిందే. బజాజ్ కెటియమ్ ద్వారా యుయస్ మరియు యూరోపియన్ మార్కెట్ లోకి ప్రవేశించడానికి అవకాశం కలుగుతుందని అన్నారు.


Click it and Unblock the Notifications








