భారతీయ రెండవ అతిపెద్ద టూ వీలర్ సంస్థ బజాజ్ ఆటో, నాల్గవ అతిపెద్ద టూ వీలర్ సంస్థ హోండా మోటర్ సైకిల్ స్కూటర్స్ గత జనవరి నెలలో జరిగిన అమ్మకాలలో లాభాలతో దూసుకుపోతున్నాయి. ఇందులో బజాజ్ ఆటో జనవరి నెల అమ్మకాలలో 112 శాతం పెరుగుదలను నమోదుచేసుకుంది. గత ఏడాది జనవరి నెలలో 71,970 యూనిట్ల అమ్మకాలను నమోదుచేసుకున్న బజాజ్ ఈ ఏడాది జనవరి నెలలో అమ్మకాలలో 112 శాతం పెరుగుదలను నమోదుచేసుకుని 109,666 యూనిట్లను అమ్మగలిగింది.
ఇక హోండా మోటర్ సైకిల్ స్కూటర్స్ గత జనవరి నెల అమ్మకాలలో 25 శాతం పెరుగుదలను నమోదుచేసుకుంది. గత ఏడాది జనవరిలో 94,982 యూనిట్ల అమ్మకాలను నమోదుచేసుకున్న ఈ సంస్థ ఈ ఏడాది 118,571 యూనిట్ల అమ్మకాలను నమోదుచేసుకుంది. మొత్తంగా మోటార్ సైకిలో అమ్మకాలు జనవరి నెలలో 29 శాతం పెరిగాయి.