హీరోహోండా లాభాల స్పీడ్

హరిద్వార్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచటానికి 130 కోట్ల రూపాయల పెట్టుబడితో పాటు మొత్తం మూలధన వ్యయంలో 350 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ సిఎఫ్ ఒ రవి సూద్ తెలిపారు. ఆగస్టు - సెప్టెంబర్ నాటికి కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 5.7 మిలియన్ యూనిట్లకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ మార్చితో ముగిసిన త్రైమాసికానికి 4,122 కోట్ల రూపాయల మొత్తం టర్నోవర్‌పై 599 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే కంపెనీ లాభం 49 శాతం పెరగటం విశేషం. కంపెనీకి చెందిన ప్రస్తుత మూడు ప్లాంట్లు 2010-11లో పూర్తి సామర్థ్యాన్ని చేరుకున్న తర్వాత నాలుగో ప్లాంట్‌ను గురించి యోచిస్తామని సూద్ తెలిపారు.


Click it and Unblock the Notifications








