హీరోహుండాలో కోత్త మోటార్ సైకిల్స్ కి సన్నాహాలు..!

హీరోహుండా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్) అనిల్ దూ మాట్లాడుతూ ఇండియాలో టూ వీలర్స్ కి బాగా క్రేజ్ ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం టూ వీలర్స్ ఇండస్ట్రీ ఎదుగుదల తో ఉంది. మేము కూడా దీనిని అవకాశంగా తీసుకోని వచ్చే నెలలో కూడా మా సేల్స్ ఇలాగే కోనసాగించాలని అనుకుంటున్నాం. మేము నాలుగు నెలల నుండి వరుసగా నెలకి 4,00,000 బైక్స్ ని అమ్మడం జరిగినది, ఇది మాకు చాలా ఆనందంగా ఉంది.
వచ్చే నెలలో పండగలు ఉన్న సంధర్బాన కోత్త మోడల్స్ ని మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాం. హీరోహుండాలో ఎవర్ గ్రీన్ బైక్స్ పాషన్, స్ప్లేండర్ మంచి అమ్మకాలు నమోదు చేశాయి. ఆగస్టులో హీరోహుండా ఆటోమాటిక్ స్కూటర్ ప్లజర్ 27,000 యూనిట్స్ ని అమ్మడం జరిగినది. అంతేకాకుండా హీరోహుండాలో కోత్త 125సిసి సూపర్ స్ప్లేండర్ తోపాటు 150సిసి మోటార్ సైకిల్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.


Click it and Unblock the Notifications








