హోండా మోటార్స్ నుండి స్పోర్ట్స్ బైకు..

Honda Motors
ఇండియాలో హోండా మోటార్స్ కున్న ప్రత్యేకత వేరు. పోయిన సంవత్సరంలో 12.7లక్షల మోటారు సైకిల్స్ అమ్మకాలు జరిపినటువంటి హోండా మోటార్స్, మార్చి 2011సంవత్సరానికల్లా మోటార్ సైకిల్స్, స్కూటర్స్ రెంటిని కలుపుకోని దాదాపు 17లక్షల యూనిట్లు అమ్మకాలు జరపాలని టార్గెట్ పెట్టుకున్నామని అన్నారు. దీని ద్వారా ప్రజలలోకి తమ యొక్క హోండా మోటార్స్ బ్రాండ్ త్వరితగతిన వెళుతుందని ఆసంస్ద ఆపరేటింగ్ హెడ్(సేల్స్ విభాగం) వారు తెలియజేశారు. అంతేకాకుండా కంపెనీ యొక్క వృద్ది కూడా రెండంకెలకు చేరుతుందని ఆశిస్తున్నాం అని అన్నారు. ఇక ఎగుమతులు విషయానికి వచ్చేసరికే పోయిన సంవత్సరం 75000యూనిట్లు అమ్మకాలు జరపగా ఈసంవత్సరం మాత్రం లక్షయూనిట్లు అమ్మాకాలు జరపాలని మావంతు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈనవంబర్ వరకు హోండా మోటార్స్ అమ్మకాలు 61000యూనిట్లు అమ్మకాలు జరిపామని తెలిపారు.

బైకు ప్రియులకు ఇంకోక శుభవార్త త్వరలో హోండా మోటార్స్ నుండి స్పోర్ట్స్ బైకు సిబిఆర్-250ఆర్ నువిడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈబైకు ఏప్రిల్ 2011లోవిడుదల చేయవచ్చునని ఇక ఖరీదు విషయానికి వస్తే రూ1.5లక్షలుగా ఉంటుందని తెలిపారు. దీనితో పాటు వేరే మోడల్స్ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి రాజస్దాన్ లోకొత్తగా ఓ ప్లాంట్ నుస్దాపించడం జరిగిందని, ఈప్లాంటుకు గాను సుమారు 500కోట్లు రూపాయలు వెచ్చిస్తున్నామని అన్నారు. ఇది వచ్చేసంవత్సరం చివరి కల్లా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈప్లాంటు గనుక వాడుకలోకి వచ్చినట్లైతే సుమారు 6లక్షలు యూనిట్లు డెలివరి చేయడానికి వీలుగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతానికి హార్యానాలో ఉన్నటువంటి ప్లాంటునుండి సంవత్సరానికి 16లక్షలు యూనిట్లు డెలివరి చేసే సామర్ధ్యం ఉందని తెలిపారు.

More from DriveSpark

Article Published On: Monday, December 20, 2010, 11:49 [IST]
English summary
To make an impressive growth rate in its sale volume, Honda Motorcycles and Scooters India is setting a target of 17 lakh units for this fiscal from 12.7 lakhs units of the last year. This comes in the wake of good show by the company in both scooter and motorcycles, said the Operating Head for sales and marketing for India of the company. This, he added, will bring in double digit growth for the company.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+