ఇక ఇండియా రోడ్ల మీద మహీంద్రా మోజో...

ఇక కంపెనీ యమ్ డి మరియు వైస్ ఛైర్మన్ మాట్లాడుతూ ఈ మోజో వల్ల మాకంపెనీ టూవీలర్స్ సామర్ద్యం కూడా తెలుస్తుందన్నారు. ఇక డిజైన్ విషయంలో మోజో పై చాలా జాగ్రత్తలు తీసుకోని నిర్మించామన్నారు. అంతేకాకుండా ఇండియన్ మార్కెట్ లో అతి వేగంగా ప్రయాణించే బైకుగా కూడా రికార్డు సాధిస్తుందన్నారు. ఇక రెండవ బైకు స్టాల్లిఓ విషయానికి వస్తే 110సిసి సామర్ద్య కలిగి ఉంటుందన్నారు. ఈ బైకు ప్యూయల్ సామర్ద్యం, ఎకానమి ప్రెజింగ్ మరియు లేటెస్ట్ ప్యూచర్స్ తో కస్టమర్స్ నిబాగా ఆకర్షిస్తుందని అన్నారు. ఈ రెండు బైక్స్ నుటెస్ట్ చేసి త్వరలోనే మార్కెట్ లోకి ప్రవేశపెట్టనున్నామని అన్నారు.
ఈ బైక్స్ ప్రమోషన్ లోభాగంగా లడక్ నుండి నాగ్ పూర్ వరకు బైక్ షో చేయడానకి 20మంది బైకర్స్ నిఏర్పాటు చేశామన్నారు. గతంలో కైనటిక్ గేర్ లెస్ స్కూటర్ నివిడుదల చేశామని దాని వల్లన మాకు 80శాతం లాభాలు వచ్చాయని, అంటే దాదాపుగా 110కోట్ల రూపాయలు లాభాలు వచ్చాయని అన్నారు.


Click it and Unblock the Notifications








