ఒక్క ముంబయిలోనే తోమ్మిది షోరూమ్స్...

ముందుగా అనుకున్న ప్రకారం ఈరెండు మోడల్స్ ప్రమోట్ చేసే విషయాలను డీలర్స్ కేఇవ్వడం జరిగిందని అన్నారు. ఇటీవలే ముంబయి సినర్జీ ఆటో వాళ్శకి డీలర్ షిప్ ఇవ్వడం జరిగింది. ఈషోరూమ్ ముంబయి సబ్ అర్బన్ ఏరియాలు అయిన సాకి నాకా, అంధేరికి బాగా దగ్గర ఉందని అన్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ టూవీలర్స్ కిఇది 393వ డీలర్ షోరూమ్. ఒక్క మహారాష్ట్రలోని ముంబయిసిటీలో చూసుకుంటే ఇది తోమ్మిదవ డీలర్ షిప్ షోరూమ్.
మహీంద్రా అండ్ మహీంద్రా వైస్ ప్రెసిడెంట్(మహీంద్రా టూవీలర్స్) డీలర్స్ తో మాట్లాడుతూ మన షోరూమ్ కివచ్చినటువంటి కస్టమర్స్ కుఈరెండు మోడల్స్ గురించి టాప్ ప్రయారిటీ ఇవ్వవలసిందిగా కోరారు. వెస్ట్ జోన్ ముంబయి లోమాత్రం కస్టమర్స్ కుఈటూవీలర్స్ పై సరైన అవగాహాన ఉందని అన్నారు. ప్రస్తుతం ఈషోరూమ్ 1500 స్కైర్ ఫీట్ స్దలంలో నిర్వహించబడుతుందని, ఇక్కడ టూవీలర్స్ తోపాటు వర్క్ షాప్ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ స్కూటర్స్ లభించనున్నాయని తెలిపారు. గత నెలలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ టూవీలర్ బైక్స్ అయినటువంటి స్టాలియో 110సిసి మరియు మోజో 300సిసి సామర్ద్యం గల బైక్స్ నివిడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక వీటికి బ్రాండ్ అంబాసిడర్ గా అమీర్ ఖాన్ వ్యవహారిస్తున్న విషయం కూడా తెలిసిందే.


Click it and Unblock the Notifications








