మనం అనుకున్నట్టుగానే సుజుకీలో మరోక కోత్త బైకు మెరవనుంది. దానిపేరే 'సుజుకీ స్లింగ్ స్లాట్'. ఈ కోత్త సుజుకీ స్లింగ్ స్లాట్ ఇంజను సామర్థ్యం 125 సిసి కలిగి వుంటుందని, ఇది మీకు నాలుగు కలర్స్(మెటాలిక్ మస్ట్ ర్డ్ యల్లో, మెటాలిక్ పాక్స్ ఆరంజ్, కాండీ రెడ్, పెరల్ నెబ్లర్ బ్లాక్) లో లభ్యం అవుతుంది. సుజుకీ స్లింగ్ స్లాట్ 125 సిసి, 5 స్పీడ్ ట్రాన్సిమిషన్ తో పాటు సుజుకీ జీయెస్ తో పోలిస్తే 14 కేజీల బరువు ఎక్కువగా వుంటుంది. సుజుకీ స్లింగ్ స్లాట్ మీకు రెండు వేరియంట్స్ తో లభిస్తుంది ఒకటి స్లింగ్ స్లాట్ అల్లో వీల్, రెండవది స్లింగ్ స్లాట్ స్పోక్. ఇంతకీ దీని ఖరీదు ఎంత అనిఅనుకుంటున్నారా..? సామాన్యులకు కూడా అందుబాటులో వుండేటట్టు రూ 50,140 గా నిర్ణయించడం జరిగినది.
ఈ సంధర్భంగా సుజుకీ చైర్మన్ కస్తూమీ తకాటా మాట్లాడుతూ ప్రపంచంలో కెల్లా మోటార్ సైకిల్స్ విభాగంలో నమ్మకానికి మారుపేరు సుజుకీ అనేలా పేరుగడించాము. మీకు క్వాలిటీ విషయంలో మేము మీకు గ్యారంటీ ఇస్తున్నాము అని ఆయన అన్నారు.