హార్యానాలో హార్లే-డేవిడ్ అసెంబ్లీ ప్లాంటు..

Harley-David
ఆటోమొబైల్స్ అంటే చాలా మందికి అమితమైన ఇష్టం. అలాంటి వారందరికి ఓ శుభవార్త. ప్రపంచంలో ప్రసిధ్దిగాంచినటువంటి యుయస్ మోటార్ సైకిల్ తయారీ సంస్ద హార్లే-డేవిడ్ ఇండియాలోకి ప్రవేశించబోతుంది. వచ్చే సంవత్సరం మొదటిలో హర్యానాలో అసెంబ్లీ ప్లాంటుని పెట్టడానికి రంగం సిద్దం చేసింది. హార్లే-డేవిడ్ అమెరికా టూవీలర్ తయారీ సంస్ద ఇప్పటివరకు ఇతరదేశం అయినటువంటి బ్రెజిల్ లోమాత్రమే తన ప్లాంటుని నెలకోల్పడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో ఈప్లాంటుని నెలకోల్పడం వల్ల హార్లే-డేవిడ్ ప్లాంటుని ప్రవేశపెట్టినటువంటి రెండవ దేశంగా భారతదేశాన్ని చెప్పుకోవడం జరుగుతుంది.

కంపెనీ యమ్ డి మాట్లాడుతూ ఈప్లాంటుని పెట్టిన తర్వాత భారతదేశంలో మేము సహాకారం అందించేటటువంటి డీలర్స్ కోసం వేట ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతానికి ఎవరైన కస్టమర్స్ కుబైక్స్ ఇవ్వవలసిన సమయంలో డైరెక్టుగా అమెరికా లోని ఎపెక్స్ ప్లాంటుని దిగుమతి చేసుకోవడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా కంపెనీ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మరియు ప్రెసిడెంట్ మాట్లాడుతూ భారతదేశంలో మేము ఈకోత్త ప్లాంటు పెట్టడం వల్ల ఆటోమొబైల్స్ మార్కెట్ కికోత్త పుంతలకి అవకాశం కల్పించనున్నట్లు అనుకుంటున్నామని అన్నారు.

మేము ప్రవేశపెట్టనటువంటి ఈప్లాంటు బాగా ఊపుందుకున్న తర్వాత కంపెనీ అమెరికా నుండి టెక్నిషీయన్స్ ని మరియు విడిభాగాలను తీసుకోని వచ్చి అసెంబ్లింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఆగస్టు 2009లో ప్రవేశపెట్టనటువంటి కోన్ని మోడల్స్ మాత్రం ఇప్పటికి కూడా దిగుమతి చేసుకోవడం జరుగుతుందని అన్నారు. డిసెంబర్ లో బియమ్ డబ్ల్యుకి సంబంధించినటువంటి టూవీలర్స బైక్స్ నిభారతదేశంలో ప్రవేశపెట్టనున్న తరుణంలో వాటినుండి కూడా గట్టి పోటిని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, November 4, 2010, 10:42 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+