దీపావళికి టూవీలర్స్ పై డిస్కంట్స్ కి తావు లేదు..!

అతుల్ గుప్తా ఇండియా వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్ మరియు సేల్స్) మాట్లాడుతూ సుజికి మోటార్ సైకిల్స్ ఈ సంవత్సరం ఎటువంటి డిస్కెంట్ లు మరియు ఎక్సేంజ్ లను ప్రకటించడం లేదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ ని బట్టి కస్టమర్స్ కి సరైన సమయంలో డెలివరి చెయ్యాలని అనుకుంటున్నామని వెల్లడించారు. హీరోహుండా కూడా దీపావళికి పాత బైక్ లకు ఎటువంటి ప్రమోషన్స్ నిర్వహించడం లేదని, కొత్తగా విడుదల చేసేవాటికి మాత్రమే ప్రమోషన్స్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
బజాజ్ ఆటో, ఇండియాలోనే రెండవ టూవీలర్స్ మేకర్ కూడా ఈ సంవత్సరం ఎటువంటి డిస్కంట్స్ కి తావు లేదని, అంతేకాకుండా సున్న శాతం ఫైనాన్స్ సంబందించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వారు వివరించారు. సున్న శాతం ఫైనాన్స్ వల్ల బజాజ్ అమ్మకాలు గత కోన్ని సంవత్సరాలుగా బాగా అమ్ముడవం తెలిసిందే. మిలింద్ బేడ్ హెడ్ మార్కెటింగ్ బజాజ్ ఆటో మాట్లాడుతూ ప్రస్తుతం బజాజ్ మోటార్ సైకిల్స్ రేట్స తగ్గడం తో ఇంక డిస్కంట్స్ ఇవ్వడానికి వీలులేదని ఆయన వెల్లడించారు. కొన్ని సంవత్సరాల క్రితం టూవీలర్స్ మార్కెట్ ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా బాగా జరిగిందని ఆయన అన్నారు. అంతకు మునుపు బజాజ్ ఆటో, టివియస్ మోటార్స్ పండగ సందర్బంలో క్యాష్ డిస్కంట్స్ 3000 వరకు ఇవ్వడం మనకు తెలిసిన విషయమే. ఇంక హీరోహుండా ఐతే 2008 దీపావళి సందర్బంగా మూడు లక్షల టూవీలర్స్ ని ఇలా అమ్మడం అందరికి తెలిసిందే.


Click it and Unblock the Notifications








