స్కూటర్స్ ఇండియా ని హస్తగతంచేసుకోబోయే దిశగా మహీంద్రా అండ్ మహీంద్రా...?

Lambretta Scooters
మహీంద్రా అండ్ మహీంద్రా తన సామ్రాజ్యాన్ని ఒకటి తర్వాత గా విస్తరించుకోనుంది. మొన్న సాంగ్ యాంగ్ తో భాగస్వాయ్యం, ఈ రోజు స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ ని సోంతం చేసుకోవడానికి పోటీపడుతుంది. నష్టాలతో ఉన్న 'స్కూటర్స్ ఇండియా లిమిటెడ్' తో కలసి ఒక సంయుక్త సంస్థ ను ఏర్పాటు చేసేందుకు రాగల భాగస్వామి కోసం అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 'మహీంద్రా అండ్ మహీంద్రా' సహా పలు సంస్దలు ఈ కంపెని పై కన్నువేశాయి. భారీపరిశ్రమలు, ప్రభుత్వ సంస్దల శాఖామంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ గురువారం ఇక్కడ భారతీయ వాహన తయారిదారుల సంఘం కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ సంగతి తెలిపారు. ప్రతి సంస్ద కు అనకాశం ఉంటుంది. ఎవరైతే మంచి ప్యాకేజిని ప్రతి పాదించితే వారికే స్కూటర్స్ ఇండియా సోంతం అవుతుందని ఆయన అన్నారు.

మెజారిటీ వాటా ప్రభుత్వం చేతిలో ఉంటుందని, మహీంద్రా అండ్ మహీంద్రా తో పాటు రాజ్ కోట్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న త్రిచక్ర వాహన సంస్థ అతుల్ ఆటో, ఇంకా బజాజ్ ఆటో, పియాజియో లు కూడా స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ లో వాటా కోనుగోలు కు ఆసక్తి కనబరుస్తున్నాయని ఆయన అన్నారు. గురువారం ఉదయం తాము భారీపరిశ్రమలు, ప్రభుత్వ సంస్దల శాఖామంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ తో స్కూటర్స్ ఇండియాలో వాటా కోనుగోలు విషయం గురించి చర్చించినట్లు ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ (వాహనాలు, వ్యనసాయసామాగ్రి విభాగం)పవన్ గోయెంకా అన్నారు. లక్నో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్కూటర్స్ ఇండియా 'లాంబ్రెట్టా మోడల్ స్కూటర్స్' ను ఉత్పత్తి చేసేది. నష్టాలు రావడంతో ఆ స్కూటర్స్ తయారీని ఆపివేసింది. లాంబ్రెట్టా మోడల్ స్కూటర్స్ కి పెట్టింది పేరు స్కూటర్స్ ఇండియా.

More from DriveSpark

Article Published On: Friday, August 27, 2010, 10:21 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+