యమహా యఫ్ జడ్ సిరిస్ ఆదుర్స్..

కంపెనీ డైరెక్టర్(సేల్స్ మరియు మార్కెటింగ్) మాట్లాడుతూ కోత్తగా ప్రవేశపెట్టునటువంటి యఫ్ జడ్ సిరిస్ బైక్స్ కంపెనీకి మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయని అన్నారు. ఇక కమర్షియల్ యూనిట్లు అయినటువంటి వైబిఆర్ 125 మరియు వైబిఆర్ 110లు కూడా మంచి ఎక్కువ సేల్స్ ని నమోదు చేయడం జరిగిందన్నారు. కస్టమర్స్ పండుగ సమయంలో చేసుకున్నటువంటి ఆర్డర్స్ నిసరైన సమయంలో అందించి యమహా కస్టమర్స్ యొక్క ప్రేమను చూరగోన్నము.
యమహా ఇండియా భారతదేశంలో తన యొక్క బ్రాండ్ ఇమేజిని ఇమడింపజేసుకోవడం మాత్రమే కాకుండా గ్లోబల్ మార్కెట్ లోతన సత్తా చూపించడానికి సిద్దంగా ఉందని అన్నారు. యమహా బైక్స్ నడిపేటప్పుడు తీసుకోవలసిన తగు జాగ్రత్తలు యూత్ కిమరియు నడిపే ప్రతి ఒక్కరికి వివరించాడిని ఓ సరికోత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ఇలా చేయడం వల్ల దేశంలోని 2-టైర్ మరియు 3-టైర్ సిటిలలో యమాహా డీలర్స్ పెంపోందించుకోవడానికి వీలుగా ఉంటుందని అన్నారు. అంతేకాకుండా సబ్ డీలర్స్ కూడా ఆఫర్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications








