టీవీఎస్ కస్టమర్లకు దేనా బ్యాంక్ రుణ సదుపాయం

టీవీఎస్ వాహనల యొక్క ధర (ఆన్ రోడ్ ధర)పై దాదాపు 90 శాతం వరకూ రుణాన్ని అర్హత కలిగిన వినియోగదారులకు దేనా బ్యాంక్ అందించనుంది. ముఖ్యంగా టీవీఎస్ అందిస్తున్న త్రిచక్ర వాహనాలపై ఆకర్షనీయమైన వడ్డీరేట్లకే రుణాలను అందించనున్నట్లు దేనా బ్యాంక్ పేర్కొంది. ఇదే కాకుండా టీవీఎస్‌కు స్వతహాగా ఫైనాన్స్ విభాగం కూడా ఉంది.
ఈ కార్యక్రమంలో దేనా బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.కె దత్, టీవీఎస్ మోటార్ కంపెనీ ఉపాధ్యక్షుడు కె. శ్రీనివాసన్, దేనా బ్యాంకు జనరల్ మేనేజర్ ఎమ్.కె శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం కుదిరిన రోజునే 101 'టీవీఎస్ కింగ్' త్రిచక్ర వాహనాల కొనుగోలు ప్రతిపాదనకు దేనా బ్యాంక్ ఇన్-ప్రిన్సిపల్ క్లియరెన్స్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications








