సూపర్ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'హోండా ఆర్‌సీ-ఈ'

దీని పేరును ఉచ్ఛరించేటప్పుడు రేస్-ఈ అనే శబ్ధం వస్తుంది. అంటే.. రేస్‌ల కోసం ఉపయోగించే ఎలక్ట్రిక్ బైక్ అనే అర్థం వచ్చేటట్లుగా హోండా ఈ బైక్ పేరును ఖరారు చేసింది. సాధారణంగా మోటార్‌స్పోర్ట్స్, రేస్‌లకు ఉపయోగించే స్పోర్ట్స్ బైక్‌లను అధక శక్తిని, వేగాన్ని కలిగి ఉండి పెట్రోల్‌ను మంచినీళ్ల ప్రాయంగా తాగేస్తుంటాయి.
ఈ నేపథ్యంలో ఇటువంటి ఈవెంట్లకు పెట్రోల్‌తో నడిచే వాహనాలకు బదులు విద్యుచ్ఛక్తితో నడిచే వాహనాలను ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో హోండా ఈ సూపర్ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్‌ను అభివృద్ధి చేసింది. ఈ నెలలో జరగనున్న టోక్యో మోటార్ షోలో హోండా ఈ "ఆర్‌సీ-ఈ" కాన్సెప్ట్ బైక్‌ను ఆవిష్కరించనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను విడుదల రోజున కంపెనీ తెలియజేయనుంది.


Click it and Unblock the Notifications








