హోండా నుంచి సరికొత్త డీలక్స్ వేరియంట్ యునికార్న్ డాజ్లర్

హోండా తాజాగా అదిస్తున్న డీలక్స్ వేరియంట్ సిబి యునికార్న్ డాజ్లర్ రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభ్యం కానుంది. దీని ధర రూ.66,198 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. స్టాండర్డ్ వేరియంట్ సిబి యునికార్న్ డాజ్లర్ ధర రూ.65,198 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కొత్త వేరియంట్‌లో ఎలాంటి సాంకేతిక మార్పులను కంపెనీ చేయలేదు. ఇది బిఎస్-3 కాలుష్య నిబంధనలను పాటిస్తుంది. ట్యూబ్‌లెస్ టైర్స్, అల్లాయ్ వీల్స్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.


Click it and Unblock the Notifications








