ఇండోనేషియాలో కొత్త స్పోర్టీ అపాచీని లాంచ్ చేసిన టీవీఎస్

సరికొత్త ఫ్రంట్ డిజైన్, రీడిజైన్డ్ ఫ్యూయెల్ ట్యాంక్, వెడల్పాటి టైర్లు, స్ప్లిట్ సీట్స్ వంటి ఎన్నో ఆకర్షనీయమైన ఫీచర్లతో రూపొందించిన ఈ కొత్త స్పోర్టీ అపాచీను టీవీఎస్ ఇండోనేషియా మార్కెట్లో ఆవిష్కరించింది. అలాగే, భారత మార్కెట్ కోసం కూడా కంపెనీ అభివృద్ధి చేస్తున్న సరికొత్త టీవీఎస్ అపాచీ మోడల్‌ను వచ్చే జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో టీవీఎస్ అందిస్తున్న ఏకైక స్పోర్ట్స్ బైక్ అపాచీ. ఇది 160, 180, 180 ఏబిఎస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) టెక్నాలజీతో కూడిన మోటార్‌సైకిల్‌ను (టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 180 ఏబిఎస్) ప్రవేశపెట్టిన దేశీయ కంపెనీగా టీవీఎస్ రికార్డు సృష్టించింది. మరి కొత్త స్పోర్ట్స్ బైక్‌ను విడుదల చేసేందుకు టీవీఎస్ సిద్ధంగా ఉంది మరి ఈ సూపర్ రైడ్‌కు మీరూ సిద్ధంగా ఉన్నారా..?


Click it and Unblock the Notifications








