రికమెండ్ చేసిన ఇంజన్ ఆయిల్‌ను మాత్రమే వాడండి!

సరైన ఇంజన్ ఆయిల్‌ను ఎంచుకోవాలంటే, వాహనంతో పాటు కంపెనీ ఇచ్చే యూజర్ మ్యాన్యువల్ ప్రకారం గానీ లేదా తయారీదారుడు (మ్యానుఫాక్చరర్) రికమెండ్ చేసే ఇంజన్ ఆయిల్‌ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉదాహరణకు మీరు హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ బైక్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, కంపెనీ మీకు హీరో హోండా 4-టి జెన్యూన్ ఇంజన్ ఆయిల్‌ను రికమెండ్ చేస్తుంది.
కొత్త స్ప్లెండర్ ప్లస్ బైక్ కొన్న వారు మొదటిసారిగా 500-750 కి.మీ. రేంజ్‌లో ఇంజన్ ఆయిల్‌ను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 6,000 కి.మీ. ఒకసారి చొప్పున పూర్తిగా మార్చుకుంటే సరిపోతుంది. అలాగే ప్రతి 2,000 క్రి.మీ. ప్రయాణం అనంతరం ఇంజన్ ఆయిల్‌ను నింపుకుంటే (టాప్అప్) సరిపోతుంది. ఇంజన్ ఆయిల్ స్థాయిని తరచూ తనిఖీ చేసుకుంటూ ఉండాలి.


Click it and Unblock the Notifications








