హ్యోసంగ్ జిటి650ఎన్ సూపర్‌బైక్‌ భారీ డిస్కౌంట్

Hyosung GT650N
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఎస్&టి మోటార్స్ భారత్‌లో తాజాగా ప్రవేశపెట్టిన హ్యోసంగ్ బ్రాండ్ సూపర్‌బైక్‌ 'హ్యోసంగ్ జిటి650ఎన్'పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. గత అక్టోబర్ నెలలో విడుదలైన ఈ సూపర్‌బైక్ ధర రూ.4.39 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. అయితే ప్రస్తుతం ఇది కేవలం రూ.3.80 లక్షలకే లభ్యమవుతుంది.

అంటే, హ్యోసంగ్ జిటి650ఎన్ సూపర్‌బైక్ కొనుగోలుపై సుమారు రూ.60,000 వరకూ డిస్కౌంట్‌ను పొందవచ్చన్నమాట. భారత్‌లో గార్వారే మోటార్స్ ద్వారా లభ్యమవుతున్న హ్యోసంగ్ జిటి650ఎన్ సూపర్‌బైక్ 650సీసీ, వీ-ట్విన్ 8-వాల్వ్, డిఓహెచ్‌సి లిక్విడ్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌ను కలిగి ఉండి, 72 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

మొత్తం 196 కిలోల బరువు ఉండే ఈ మోటార్‌సైకిల్ గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 14 డీలర్‌షిప్ కేంద్రాలలో ఈ హ్యోసంగ్ జిటి650ఎన్ సూపర్‌బైక్ లభ్యం కానుంది. ప్రస్తుతం ఈ మోటార్‌సైకిల్ మూడు రంగులలో మాత్రమేల భిస్తుంది. హ్యోసంగ్‌కు భారత్‌లో ఇది మూడవ సూపర్‌బైక్.

పూణేకు చెందిన గర్వారే మోటార్స్‌ మోటార్స్ గత ఏప్రిల్ నెలలో హ్యోసంగ్ జిటి650ఆర్, హ్యోసంగ్ ఎస్‌టి7 అనే రెండు సూపర్‌బైక్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Saturday, November 26, 2011, 15:25 [IST]
English summary
Hyosung the Korean superbike manufacturer recently launched superbike the Hyosung GT650N now available at the discounted price of Rs.3.8 lakhs (Ex-showroom). The GT650N is a sportier bike and is expected to take on the Kawasaki Ninja 650R.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+