వచ్చే నెలలో స్టాలియోను రీలాంచ్ చేయనున్న మహీంద్రా

గతంలో ఈ మోటార్‌సైకిల్ గేర్ బాక్సులో సమస్యలు తలెత్తుతున్నాయని వరుస ఫిర్యాదులు అందడంతో కంపెనీ దీని ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపి వేసింది. కాగా.. ప్రస్తుతం మహీంద్రా స్టాలియోలోని లోపాలన్నింటినీ సవరించి, మరికొన్ని అదనపు మార్పులు చేర్పులు చేసి వచ్చే నెలలో విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించినట్లు కంపెనీ అధికారు ఒకరు వెల్లడించారు.
తాజాగా మార్కెట్లో రానున్న రిఫ్రెష్డ్ వెర్షన్ మహీంద్రా స్టాలియో హోండా సిబి ట్విస్టర్, టీవీఎస్ స్టార్ సిటీ వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలువనుంది. మహీంద్రా స్టాలియోలో లోపాలను సవరించేందుకు ఇటలీకు చెందిన డిజైన్ సేవల సంస్థ "ఇంజనీర్స్ ఇంజనీరింగ్"ను మహీంద్రా ఆశ్రయించింది.
స్టాలియో మోటార్‌సైకిల్‌కు గతంలో ఎమ్ అండ్ ఎమ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. మరి స్టాలియో రీలాంచ్ తర్వాత కూడా ఈ మోటార్‌సైకిల్‌కు అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గానే కొనసాగుతాడా లేదా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.
మరోవైపు వచ్చే జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పో మహీంద్రా అభివృద్ధి చేస్తున్న 300సీసీ మోటార్‌సైకిల్ మోజోను ఆవిష్కరించవచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








